Advertisementt

మెగా సంక్రాంతి సెలెబ్రేషన్స్

Mon 15th Jan 2024 05:19 PM
chiranjeevi  మెగా సంక్రాంతి సెలెబ్రేషన్స్
Mega Family Celebrate Sankranti traditionally మెగా సంక్రాంతి సెలెబ్రేషన్స్
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ మొత్తం బెంగుళూరుకి వెళ్ళింది. అక్కడ బెంగుళూరు ఫామ్ హౌస్ లో మెగా సంక్రాంతి సెకెబ్రేషన్స్ కోసం మెగాస్టార్ ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ మొత్తం బెంగుళూరుకి తరలి వెళ్ళింది. రామ్ చరణ్, ఉపాసన తమ పాప క్లింకారతో వెళ్లగా, మెగాస్టార్ చిరు.. భార్య సురేఖ, కూతుళ్లు మానవరాళ్లతో బెంగుళూరికి వెళ్లారు. కొత్త పెళ్ళికొడుకు వరుణ్ తేజ్, లావణ్యలు, ఇంకా అల్లు అర్జున్ ఆయన వైఫ్ స్నేహ, పవన్ కొడుకు కూతురు అకీరా, ఆద్య, అల్లు అరవింద్, నాగబాబు ఫామిలీస్ ఇలా మొత్తం బెంగుళూరు వెళ్లి అక్కడే కలిసి కట్టుగా సంక్రాంతి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు

ఎప్పుడెప్పుడు మెగా ఫ్యామిలీ పిక్ బయటికొస్తుందా ఎప్పుడెప్పుడు మెగా సంక్రాంతి సెలెబ్రేషన్స్ చూస్తామో అని మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంతలోనే మెగాస్టార్ చిరు సోషల్ మీడియా ద్వారా.. పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ! అంటూ మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ తో పండగ కళ కొట్టొచ్చినట్టుగా దిగిన పిక్ ని షేర్ చేసారు. అందరూ సాంప్రదాయపద్ధతిలో కనిపించగా.. ఎప్పటిలాగే రామ్ చరణ్ కూతురు క్లింకార ఫోటో ని చూపించకుండా దాచేసారు.

Mega Family Celebrate Sankranti traditionally:

Chiranjeevi and family celebrate Sankranti in Bengaluru

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ