సుశాంత్ సింగ్ రాజపుట్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి.. డ్రగ్స్ కేసులో, సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ఆత్మహత్య కేసులో జైలు కెళ్ళి బెయిల్ పై బయటికొచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ కేసులో రియా చక్రవర్తిని నేరస్తురాలిగా చేస్తూ సోషల్ మీడియా లో వచ్చిన వార్తలతో చాలా రోజులు ఆమె మీడియాకి ముఖం చూపించలేదు. ఇక ప్రస్తుతం తన షూటింగ్స్ ఏవో చేసుకుంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన జైలు అనుభవాలపై స్పందిస్తుంది.
తాజాగా రియా చక్రవర్తి ఓ షోకి హాజరైంది. అక్కడ తన జైలులో అనుభవించిన నరకాన్ని మరోసారి చెప్పుకొచ్చింది. నాకు జైలులో రోటి, క్యాప్సికమ్ కర్రీ పెట్టేవారు. అలా చెప్పుకోవడానికే కానీ.. అవి నీళ్లలా ఉండేవి. అయినప్పటికీ ఆకలికి తట్టుకోలేక వాటినే తినేదాన్ని. అంతేకాకుండా నేను పడుకునే ప్లేస్ పక్కనే బాత్ రూమ్ ఉండేది. ఇలాంటి దుర్భరజీవితాన్ని నేను జైలులో గడిపాను. ఆ సమయంలో నేను పడిన శారీరక బాధకన్నా మానసిక బాధే ఎక్కువ. కానీ మిగతా వాళ్లతో పోలిస్తే నేను కాస్త బెటర్ అనుకునేదాన్ని.
కొంతమందికి బెయిల్ వచ్చినా 5 వేలు, పది వేలు కట్టలేక జైలులోనే ఉండిపోయేవారు. నాకు బెయిల్ వచ్చినప్పుడు మీరు హీరోయిన్ కదా.. డాన్స్ చెయ్యమని అడిగారు. నేను వాళ్ళ కోసం డాన్స్ వేసాను అంటూ రియా చక్రవర్తి జైలులో గడిపిన జీవితాన్ని ఆ షోలో చెప్పుకొచ్చింది.