Advertisementt

తారక్ దేవర డిజిటల్ పార్ట్నర్ ఫిక్స్

Mon 15th Jan 2024 11:28 AM
devara  తారక్ దేవర డిజిటల్ పార్ట్నర్ ఫిక్స్
Devara OTT partner locked తారక్ దేవర డిజిటల్ పార్ట్నర్ ఫిక్స్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర నుంచి ఈ నెల 8 న గ్లిమ్ప్స్ విడుదలయ్యాయి. దేవర గ్లిమ్ప్స్ కి అభిమానులు నుంచి, ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవర మూవీ ఏప్రిల్ 5 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో ఏడాది క్రితమే ప్రకటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో జత కడుతున్న దేవర మూవీ కి సంబందించిన ఏ అప్ డేట్ అయినా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

తాజాగా ఎన్టీఆర్ దేవర మూవీ డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ ఆఫర్ తో సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ సంస్థకి దేవర ఓటిటి రైట్స్ ని విక్రయించినట్లుగా పొంగల్ సందర్భంగా అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. దేవర చిత్రం థియేటర్స్ లో విడుదలయ్యాక 60 రోజుల గ్యాప్ తో నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటిటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

దేవర చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఓటిటిలో విడుదలకు రెడీ.. అది థియేట్రికల్ రిలీజ్ తర్వాత అంటూ నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.. ఈ చిత్రానికి యువ సంచలనం అనిరుధ్ రవి చంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Devara OTT partner locked :

Jr NTR Devara OTT partner fix

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ