Advertisementt

సోషల్ మీడియాలో ఎందుకింత నెగిటివిటీ

Mon 15th Jan 2024 10:31 AM
guntur kaaram  సోషల్ మీడియాలో ఎందుకింత నెగిటివిటీ
Why so much negativity on social media? సోషల్ మీడియాలో ఎందుకింత నెగిటివిటీ
Advertisement
Ads by CJ

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటురు కారం గత శుక్రవారం విడుదలైంది. అయితే గుంటూరు కారం విడుదలైన మొదటి షోకే ఆ చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ. బాబు డ్యూటీ చేసాడు.. మిగతా వారు 90 వేశారంటూ మీమ్స్, మహేష్ ని పొగుడుతూ దర్శకుడు త్రివిక్రమ్ ని ఏకి పారేస్తున్నారు. త్రివిక్రమ్ గ్రంధాలయంలో పుస్తకాలు ఖాళీ, ఆయన పెన్నులో పవర్ లేదు, ఇంకు లేదు అంటూ కామెడీ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. మహేష్ బాబు గుంటూరు కారంలో రమణ పాత్రలో రఫ్ఫాడించాడు.

అసలు గుంటూరు కారం చూసిన చాలామంది సినిమా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నంత బ్యాడ్ గా ఏమిలేదు అంటున్నారు. మహేష్ బాబు భుజాలపై గుంటూరు కారం నిలబడుతుంది, ఆయన స్టామీనానే నిలబెడుతుంది అని కొందమంది అంటుంటే.. గుంటూరు కారం సొల్లు సినిమా, రోజు రోజుకి కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి, చిన్న సినిమాని తొక్కేయాలని చూస్తే ఇదే జరిగేది అంటూ మాట్లాడుతున్నారు ఇంకొందరు. అసలు గుంటూరు కారంపై కావాలనే కొంతమంది నెగిటివి క్రియేట్ చేస్తున్నారు అంటూ మహేష్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.

పండగ వేళ ఒక్కసారి చూసే సినిమా ఇది. కానీ అసలు థియేటర్స్ వైపు వెళ్లకుండా గుంటూరు కారంపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, అజ్ఞాతవాసి ప్లాప్ సినిమా హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ గుంటూరు కారం పై కావాలనే కత్తి కట్టారంటూ మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Why so much negativity on social media?:

Why so much negativity on Guntur Kaaram

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ