హనుమాన్ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా డిమాండింగ్ గా వినిపిస్తోన్న పేరు. ఎక్కడా చూసినా హనుమాన్ గురించిన చర్చలే. సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ నెగ్గిన హనుమాన్ కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. దొరికిన కొన్ని థియేటర్స్ లో హనుమాన్ హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. పండగ మూడు రోజులు పిండివంటలు వండుకుని తిని.. సరదాగా సినిమాలకు తిరగాలనుకునేవాళ్ళు ఇప్పడు అందరూ హనుమాన్ వైపే చూస్తున్నారు. హనుమాన్ ని రెండోసారి వీక్షించేవాళ్ళు ఎక్కువగానే కనిపిస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు #HanuManEverywhere, #Hanuman, #HanuManRAMpage హాష్ టాగ్స్ దర్శనమిస్తున్నాయి. దానితో హనుమాన్ చూడాలనే కోరిక ఆడియన్స్ లో పెరిగిపోతుంది.
కొంతమంది భోగి రోజున హనుమాన్ చూద్దామంటే టికెట్స్ లేవు భయ్యా, అందుకే గుంటూరు కారం చూసొచ్చాం అని మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతి, కనుమ కూడా హనుమాన్ థియేటర్స్ లో టికెట్స్ బుక్ అయ్యాయి. హనుమాన్ విడుదలైన ప్రతి థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఆన్ లైన్ లో హనుమాన్ టికెట్స్ దొరకడం లేదు. హనుమాన్ ఇంతిలా సక్సెస్ అవ్వడానికి కంటెంట్ ప్రధానకరణమైతే హనుమాన్ ప్రీమియర్స్, ఇంకా మౌత్ టాక్ హనుమాన్ కి బాగా హెల్ప్ అయ్యాయి. అలాగే క్రిటిక్స్ ఓవరాల్ గా హనుమాన్ కి ఇచ్చిన బెస్ట్ రేటింగ్స్ అన్ని హనుమాన్ క్రేజ్ పెరగడానికి కలిసొచ్చాయి.
పండగ సందర్భంగా విడుదలైన సినిమాల్లో హనుమాన్ నెంబర్ 1 పొజిషన్ లో ఉండగా.. కింగ్ నాగ్ నా సామిరంగా రెండో స్థానంలో ఉంది. ఇక గుంటూరు కారం తర్వాత ప్లేస్ లో ఉండగా.. వెంకటేష్ సైంధవ్ చివరి స్థానంలో ఉంది. అంటే ఆడియన్స్, క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం హనుమాన్ టాప్ పొజిషన్ లో ఉండడంతో ఆడియన్స్ కూడా హనుమాన్ టికెట్స్ ప్లీజ్ అంటూ హడావిడి చేస్తున్నారు.