ఈరోజు జనవరి 14 పండగ సినిమాల్లో చివరిగా భోగి రోజున విడుదలైన కింగ్ నాగార్జున ఫ్యామిలీ ఎంటర్టైనర్ నా సామిరంగ మూవీకి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. నాగార్జున ఎనెర్జిటిక్ యాక్టింగ్, అల్లరి నరేష్ కామెడీ అన్ని వర్కౌట్ అయ్యాయని, కీరవాణి సంగీతం, BGM అన్నీ సూపర్బ్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అవడంతో అందరూ నా సామిరంగ పండగ విన్నర్ అంటూ ఫిక్స్ అవుతున్నారు. పండగ కళ ఉట్టిపడుతుంది అంటూ నా సామిరంగాకి జై కొట్టేలా నాగార్జున కొత్త సినిమాకి టాక్ స్ప్రెడ్ అయ్యింది.
కొందరు హీరోలకు కొన్ని పండగలు కలిసొస్తాయి.. అలా సంక్రాంతి నాగార్జునకు రాసి పెట్టుంది.. నా సామిరంగ సూపర్ సినిమా ఏం కాదు.. ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ కథ.. కానీ తెరకెక్కించిన విధానం ఆసక్తికరంగా ఉంది.. పండక్కి కుటుంబంతో పాటు చూసేలా అనిపించే కలర్ ఫుల్ సినిమా.. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు జరిగే కథ మనకు ముందే తెలుస్తుంది.. అయినా కూడా ఎంగేజ్ అయ్యేలా తీసాడు దర్శకుడు విజయ్ బిన్నీ.. అంటూ సోషల్ మీడియాలో నా సామిరంగ పై ప్రేక్షకులు పెడుతున్న పోస్టులు కనిపిస్తున్నాయి.
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ ఫ్యాన్సీ రేటుతో డిజిటల్ హక్కులని దక్కించుకుంది. అది డిస్ని ప్లస్ హాట్ స్టార్ నా సామిరంగ ఓటిటి రైట్స్ దక్కించుకోగా.. థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రాన్ని 40 నుంచి 45 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేసుకునేలా మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. సో నా సామిరంగ డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి ఓటిటి ఆడియన్స్ ముందుకు రాబోతుందన్నమాట.