ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం బెంగుళూరికి వెళ్ళిపోయింది. ఇప్పటికే పొంగల్ సెలెబ్రేషన్స్ కోసం ఒక్కొక్క ఫ్యామిలీ బెంగుళూరుకి చేరుకుంది. రామ్ చరణ్-ఉపాసన జంటగా పాప క్లింకారతో కలిసి బెంగుళూరు ఫ్లైట్ ఎక్కారు. ఆ తర్వాత పవన్ కొడుకు అకీరా, కుమార్తె ఆద్యలు బెంగుళూరు వెళ్లారు. ఇక కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కూడా బెంగుళూరికే పయనమయ్యారు. అక్కడే మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి మంగళవారం కనుమ వేడుకలని మనవరాలు క్లింకార, తమ్ముడు నాగబాబు, కొడుకు చరణ్, కూతుళ్ళ ఫామిలీస్ తో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.
అయితే అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించగానే ఆయన ఏ వెకేషన్ కో వెళుతున్నారని అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ కూడా తన భార్య స్నేహతో కలిసి వెళ్ళింది బెంగుళూరుకే అంట. అక్కడే మెగా ఫ్యామిలీతో కలిసి అల్లు ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో పాల్గొనబోతుంది. ఎప్పుడూ హైదరాబాద్ లోనే సంక్రాంతి సెలెబ్రేషన్స్ చేసుకునే మెగా ఫ్యామిలీ ఈసారి బెంగుళూరు ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యిందన్నమాట. ఇక మెగా ఫ్యామిలీ మొత్తం బెంగుళూరులో ఇలా పండగ సందర్భంగా గెట్ గెదర్ అవుతున్నారు.