కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ఇటీవలి కాలంలో హాట్ టాపిక్ అవుతున్నారు. వైసీపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ముద్రగడ సడెన్‌గా యూటర్న్ తీసుకున్నారు. జనసేనపైకి తన ప్రయాణాన్ని మళ్లించారు. వైసీపీతో ఉన్నంత కాలం ఆ పార్టీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు. మేలు చేకూర్చేలా వ్యవహరించారు. సీఎం జగన్ సైతం కాపులను తమ వైపు తిప్పుకోవాలని ముద్రగడను చేరదీశారు. కానీ ఎంతోకాలం పక్కనబెట్టుకోలేక పోయారు. ఏం జరిగిందో ఏమో సడెన్‌గా రూటు మార్చారు. అసలు వైసీపీతో ముద్రగడకు ఎందుకు చెడింది? ఆయన రూటు సడెన్‌గా వైసీపీ వైపునకు ఎందకు మారింది? వంటివి ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.
టీడీపీని దెబ్బ తీయడంలోనూ ప్రముఖ పాత్ర..
ఒకప్పుడు ముద్రగడ కాపు రిజర్వేషన్ల కోసం జరిపిన ఉద్యమం ఏపీలోని ప్రముఖ ఉద్యమాల్లో ఒకటి. టీడీపీని దెబ్బకొట్టడంలోనూ ఇది ప్రముఖ పాత్ర పోషించింది. 2019 తర్వాత మాత్రం ముద్రగడ కామ్ అయ్యారు. మెల్లగా వైసీపీ వైపునకు టర్న్ అయ్యారు. ఆయనొక్కరే కాదు.. ఇటీవలి కాలంలో ముద్రగడ ఫ్యామిలీ కూడా వైసీపీ వైపే తిరిగింది. వైసీపీ నుంచి టికెట్ కూడా ముద్రగడకు కన్ఫర్మ్ అన్న టాక్ నడిచింది. కానీ సడెన్ ట్విస్ట్. ఆయన జనసేన వైపునకు మళ్లారు. జనసేన నేతలతో పాటు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూతో ముద్రగడ భేటీ అయ్యారు. అయితే తనను కలవాలనుకున్న వైసీపీ నేతలకు మాత్రం దణ్ణం పెట్టేశారు. ఈ పరిణామం అందరినీ షాక్‌కు గురి చేసింది.
రాజ్యసభ సీటును ఇవ్వలేమని తేల్చేశారట..
వైసీపీని ఇంతలా దూరం పెట్టేంత ఏం జరిగిందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి ముద్రగడ రాజ్యసభ సీటును ఆశించారు. దీనికి వైసీపీ అధిష్టానం కూడా ఓకే చెప్పింది. కానీ సడెన్‌గా వైసీపీ ప్లేటు తిప్పేసిందట. ఇప్పుడు రాజ్యసభ సీటును ముద్రగడకు ఇవ్వలేమని తేల్చేసిందట. గత ఎన్నికల్లో వైసీపీకి అధికంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సీట్లు రావడానికి కారణమైన తనను ఇలా తీసి పడేయడంతో ఆయన జీర్ణించుకోలేకపోయారట. దీంతో వైసీపీకి గుడ్ బై చేప్పేశారని టాక్. ఈ క్రమంలోనే జనసేనలోనే కొనసాగితే సొంత సామాజిక వర్గం దగ్గర తనకు మంచి మర్యాద ఉంటుందని ముద్రగడ భావించి ఆ పార్టీకి చేరువయ్యారని ప్రచారం జరుగుతోంది.