Advertisementt

నా సామిరంగా ఓవర్సీస్ పబ్లిక్ టాక్

Sun 14th Jan 2024 10:28 AM
naa saami ranga  నా సామిరంగా ఓవర్సీస్ పబ్లిక్ టాక్
Naa Saami Ranga Overseas Public Talk నా సామిరంగా ఓవర్సీస్ పబ్లిక్ టాక్
Advertisement
Ads by CJ

లాంగ్ గ్యాప్ తర్వాత కింగ్ నాగార్జున డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ  చేసిన సినిమా నా సామిరంగా. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లాంటి కుర్ర హీరోలతో జత కట్టిన నాగార్జున సంక్రాంతి ఫెస్టివల్ గా నా సామిరంగా ని దించారు. షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ చిత్రంపై అంచనాలు పెంచడమే కాదు.. సంక్రాంతి టార్గెట్ అంటూ మేకర్స్  ఫైనల్ గా పండగ బరిలో దించేశారు. పోస్టర్స్ దగ్గర నుంచి పక్కా పండగ సినిమాగా కనిపించిన నా సామిరంగా నేడు భోగి పండగ రోజు జనవరి 14 న విడుదలయ్యింది. ఓవర్సీస్ లో ఇప్పటికే నా సామిరంగా షోస్ పూర్తయ్యాయి.. మరి నా సామిరంగా ఎలా ఉందో ఓవర్సీస్ ప్రేక్షకుల మాటల్లో..

నా సామిరంగాని వీక్షించిన ఓ ప్రేక్షకుడు ఇలా స్పందించాడు. కింగ్ నాగార్జున ర్యాంప్, నా సామిరంగ సినిమా ఫస్టాఫ్ బాగుంది. నాగార్జున కనిపించే సీన్లు చాలా బాగున్నాయి అంటూ ట్వీట్ చేసాడు. మరో ఆడియెన్ స్పందిస్తూ.. ఇంట్రడక్షన్ ఫైట్ బాగుంది. లవ్ స్టోరి సీన్లు ఆకట్టుకొన్నాయి. రాజ్ తరుణ్, అల్లరి నరేష్ సీన్లు కూడా చూడటానికి నైస్.. అంటూ ట్వీట్ చేసాడు. నా సామిరంగ మెంటల్ మాస్. ఇంటర్వెల్ యాక్షన్ సీన్లు అదరిపోయాయి. సైకిల్ చైన్ రెఫరెన్స్ బాగుంది. కింగ్ నాగార్జున కమ్ బ్యాక్ మూవీ.. అని మరొకొందరు ట్వీట్లు వేస్తున్నారు. 

నాగ్ ఎంట్రీ సీన్, అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్, నాగార్జున ఆషికా రంగనాధ్ మధ్య లవ్ ట్రాక్,ఇంటర్వెల్ బ్లాక్. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ హై ఎమోషనల్ సీన్స్,  సాంగ్స్ కలిపి సినిమాకు అన్నీ బాగా సెట్ అయింది, మీరెవరూ కూడా ఈ సినిమాను మిస్ చేసుకోవద్దు, సంక్రాంతికి నా సామిరంగ సినిమా మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.. అంటూ ఇంకొందరు స్పందిస్తున్నారు.

Naa Saami Ranga Overseas Public Talk:

Naa Saami Ranga Overseas Public Social Media Talk

Tags:   NAA SAAMI RANGA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ