శ్రీలీల కి గురూజీ కూడా అన్యాయం చేసారు
శ్రీలీల అందాన్ని, ఆమె నటనని, ఆమె గ్లామర్ ని వాడుకోవడం దర్శకులంతా విఫలమైనట్టే.. హీరోయిన్స్ కి ప్రత్యేక పాత్రలు ఇచ్చి.. వారి కేరెక్టర్ ని హైలెట్ చేస్తూ, గ్లామర్ చూపించే త్రివిక్రమ్ కూడా ఇప్పుడు శ్రీలీల ని సరిగ్గా వాడుకోలేకపోయారు. డాన్సులు తప్ప శ్రీలీలలో మరో కోణాన్ని దర్శకులు చూడలేకపోతున్నారా.. అవును ఆమెని హీరోల పక్కన డాన్స్ చెయ్యడానికి తప్ప మరో ఉద్దేశ్యంతో శ్రీలీలని తమ సినిమాల్లోకి తీసుకోవడం లేదు అని ఇప్పుడు గుంటూరు కారంలో ఆమె కేరెక్టర్ చూసాక చాలామంది అదే అంచనాకు వస్తున్నారు.
గత ఏడాది యంగ్ హీరోలతో ఘోరమైన డిజాస్టర్స్ సొంతం చేసుకున్న శ్రీలీల జెడ్మెంట్ ని పదే పదే విమర్శించారు. ఇక గుంటూరు కారంలో సెకండ్ హీరయిన్ గా రెండు మూడు పాత్రలకి పరిమితమవుతుంది అనుకున్న శ్రీలీలకి అదృష్టం కలిసొచ్చి మెయిన్ హీరోయిన్ స్థానంలోకి రావడంతో ఆమె లక్కు ని అందరూ పొగిడేశారు. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్స్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆయన సినిమాలన్నిట్లో చూసేసాం. కానీ గుంటూరు కారంలో శ్రీలీల ని ఓవర్ యాక్టింగ్ కి తీసుకున్నారా.. లేదంటే మహేష్ పక్కన బార్బీ డాల్ లా డాన్స్ చెయ్యడానికి తీసుకున్నారా అనిపించేలా ఆమె కేరక్టర్ ని డిజైన్ చేసారు.
శ్రీలీలని ఆమెని ఓవర్ యాక్టింగ్ ని చూడలేకపోయామంటూ గుంటూరు కారం చూసిన చాలామంది ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ లెక్కన గురూజీ కూడా శ్రీలీలకి అన్యాయం చెయ్యడంకాదు, నిండా ముంచేశారు. గుంటురు కారం సక్సెస్ అవ్వుద్ది అని నమ్మిన శ్రీలీలకి ఈ చిత్రం రిజల్ట్ బిగ్ షాక్ ఇచ్చింది.