సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా కనిపించిన హనుమాన్ ఇప్పుడు ప్రేక్షకుల నుండి పెద్ద టాక్ అందుకుని సోషల్ మీడియాలో ప్రభంజనం చూపిస్తుంది. హనుమాన్ సక్సెస్ సెలెబ్రేషన్స్, సూపర్ హిట్ రివ్యూస్, టాప్ క్రిటిక్స్ హనుమాన్ కి ఇస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ఇలా ఎక్కడ చూసినా హనుమాన్ మాటే. తెలుగు, తమిళ, హిందీ ఇలా ఏ భాషలో విడుదలైనా హనుమాన్ ని అందరూ పొగుడుతున్నారు. తమిళం నుంచి రమేష్ బాల లాంటి క్రిటిక్స్ హనుమాన్ కి సూపర్ హిట్ రివ్యూస్ ఇచ్చారు.
ఇప్పుడు హనుమాన్ ని తమిళ స్టార్ హీరో ధనుష్ స్పెషల్ స్క్రీనింగ్ లో వీక్షించబోతున్నారట. అసలైతే ధనుష్ కెప్టెన్ మిల్లర్ తో ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ డబ్బింగ్ సినిమాలు ఫెస్టివల్ సీజన్ లో విడుదల చెయ్యకూడదనే కండిషన్ తో కెప్టెన్ మిల్లర్ ని ఈ నెల 26 న తెలుగులో రిలీజ్ చెయ్యబోతున్నారు. తమిళనాట కెప్టెన్ మిల్లర్ తో సూప్ హిట్ టాక్ తెచ్చుకున్న ధనుష్ నటనని తమిళ ఆడియన్స్ తెగ పొగిడేస్తున్నారు.
ఇప్పుడు ధనుష్ తేజ సజ్జ-ప్రశాంత్ వర్మల హనుమాన్ ని స్పెషల్ స్క్రీనింగ్ లో వీక్షించబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో కనిపించగానే.. హనుమాన్ పై ప్రేక్షకుల్లో మరింత స్పెషల్ ఇంట్రెస్ట్ మొదలయ్యింది.