విక్టరీ వెంకటేష్ 75th ఫిల్మ్ సైంధవ్ మూవీ సంక్రాంతి రేసులో ఈరోజు శనివారం జనవరి 13 న విడుదలైంది. హిట్ సీరీస్ తో సూపర్ హిట్ కొడుతున్న శైలేష్ కొలను వెంకీ సైంధవ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. చాలా కాన్ఫిడెంట్ తో సంక్రాంతికి పెద్ద చిత్రాలు ఉన్నా బాక్సాఫీసు బరిలోకి దించాడు. గత నెలరోజులుగా సైంధవ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లోకి మంచి ఆసక్తిని కలిగించారు. వెంకటేష్ తన కెరీర్ లో ఎంతో ఇంపార్టెంట్ మూవీని ఏ దర్శకుడితో, ఏ జోనర్ లో చేస్తాడో అనే ఆసక్తి ఉంది. వెంకీ మాత్రం క్రైమ్ థ్రిల్లర్ ని ఎంచుకున్నారు.
నేడు విడుదలైన సైంధవ్ కి పబ్లిక్ నుంచి సో సో టాక్ వచ్చింది. తండ్రి -కూతురు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు, ఎమోషన్స్ సరిగ్గా క్యారీ చెయ్యలేదు అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని భారీ పోటీ మధ్యన డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకుంది. సైంధవ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ నుంచి ఓటిటి ప్రేక్షకుల ముందుకు రానుంది అని.. సైంధవ్ టైటిల్ కార్డ్స్ లోనే మేకర్స్ రివీల్ చేసేసారు. మరి జనవరి 13 న విడుదలైన ఈ చిత్రం మరో నాలుగైదు వారాల తర్వాతే ఓటిటిలోకి వస్తుంది అని సమాచారం.