ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కలయికలో తెరకెక్కిన హనుమాన్ విడుదలకు ముందు నుంచే థియేటర్స్ గొడవతో ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆలోచన రేకెత్తేలా చేసింది. హనుమాన్ ట్రైలర్ చూసాక ఆ చిత్రాన్ని చూడాలనే ఆసక్తితో పేక్షకులు కనిపించారు. బడా సినిమాలు సంక్రాంతి బరి నుంచి పోటీకి దిగుతున్నా మా సినిమాని ముందే సంక్రాంతి కి రిలీజ్ అన్నాము, ఆ తర్వాత ఆ బరిలోకి వచ్చిన సినిమాలు ఉన్నా మాకనవసరం మేము మాత్రం వచ్చేది వచ్చేదే అని హనుమాన్ మేకర్స్ భీష్మించుకుని కూర్చున్నారు.
అయితే హనుమాన్ కి విడుదలకు ముందు రోజు వేసిన ప్రీమియర్స్ హెల్ప్ అయ్యాయి. హనుమాన్ ప్రీమియర్ చూసిన ప్రతి ఒక్కరూ హనుమాన్ ని పొగిడేశారు. తేజ సజ్జ నటనని, ప్రశాంత్ వర్మ దర్శకత్వాన్ని, ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాఫిక్స్ అన్నిటి గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఒకపక్క గుంటురు కారం ప్రభంజనం కనిపిస్తున్నా, వినిపిస్తున్నా హనుమాన్ మేకర్స్ మాత్రం తమ సినిమాకి వస్తున్న టాక్ ని ఫుల్లుగా వాడేసుకున్నారు. సోషల్ మీడియాలో హనుమాన్ హాష్ టాగ్స్ ట్రెండ్ అవడంతో అందరి చూపు హనుమాన్ పై పడింది. మరోపక్క హనుమాన్ విడుదలైన ప్యాన్ ఇండియాలోని పలు భాషల క్రిటిక్స్ హనుమాన్ సూపర్ అంటూ 3.5 రేటింగ్స్ ఇస్తూ ట్వీట్లు వేశారు.
హనుమాన్ కి కలెక్షన్స్ పెరగడానికి మేకర్స్ చేసిన పబ్లిసిటీ ఎంతగా దోహదపడిందో.. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన మౌత్ టాక్ అంతకు మిచ్చి హెల్ప్ అయ్యింది అనే చెప్పాలి. మహేష్ బాబు ఓపెనింగ్స్ ని తట్టుకుని హనుమాన్ చెప్పుకోదగిన కలెక్షన్స్ మొదటిరోజు కొల్లగొట్టడం మాములు విషయం కాదు. హనుమాన్ ని చూసిన ప్రతి ఒక్కరూ భక్తిభావంతో కాదు.. తేజ సజ్జ, ప్రశాంత్ శర్మల ధైర్యాన్ని అప్రిషేట్ చేస్తున్నారు.