నాలుగేళ్ల క్రితం ఇదే రోజు అంటే సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12 న అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ లు అలా వైకుంఠపురములో తో అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అదే విషయాన్ని అల్లు అర్జున్ కొన్ని మేకింగ్ ఫొటోస్ ని షేర్ చేస్తూ, 4 years of AVPL . The sweetness still remains in my heart . Thanks to all of you … for such a memorable blessing. Gratitude forever 🙏🏽 అంటూ గుర్తు చేసుకున్నారు. నిజంగా ఆ చిత్రంతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారడమే కాదు.. నేషనల్ అవార్డు అందుకుని తన రేంజ్ మరింత పెంచుకున్నాడు.
అలా వైకుంఠపురములో తర్వాత తివిక్రమ్ భారీ గ్యాప్ తో మహేష్ తో గుంటురు కారం మొదలు పెట్టారు. గతంలో మహేష్ తో అతడు, ఖలేజా సినిమాలు చేసిన త్రివిక్రమ్.. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా గుంటురు కారం చేసారు. ఆది నుంచి గుంటూరు కారం మూవీ షూటింగ్ కి బ్రేకులు పడుతూ.. పోస్ట్ పోన్ అంటూ చివరికి ఈరోజు జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదలయ్యాక మహేష్ తల్లిగారు, తండ్రి కృష్ణ గారు కాలం చేశారు, ఆ తర్వాత హీరోయిన్ పూజ హెగ్డే తప్పుకోవడం, ఆమె ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి రావడం, ఇంకా సినిమాటోగ్రాఫర్ మారడం ఇవన్నీ చాలానే జరిగాయి.
అన్ని అడ్డంకులని దాటుకుని నేడు విడుదలైన గుంటూరు కారం మూవీకి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి ఓవరాల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఎంతగా పైకి నవ్వుతున్నా మహేష్ ఈ టాక్ చూసి కాస్త డిస్పాయింట్ అయ్యే ఉంటారు. నాలుగేళ్ళ క్రితం ఇదేరోజు దర్శకుడు త్రివిక్రమ్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఆ మెమోరీస్ ని నెమరువేసుకున్న అల్లు అర్జున్ ఓ వైపు, మళ్ళీ ఇదే రోజున త్రివిక్రమ్ తో కలిసి గుంటురు కారంతో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న మహేష్ మరోపక్క అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.