Advertisementt

ప్రభాస్ కల్కి 2898 AD రిలీజ్ డేట్

Fri 12th Jan 2024 11:31 AM
prabhas  ప్రభాస్  కల్కి 2898 AD రిలీజ్ డేట్
Kalki 2898 AD release date locked ప్రభాస్ కల్కి 2898 AD రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సలార్ ప్రభంజనం థియేటర్స్ లో ముగిసింది. డిసెంబర్ 22 న విడుదలైన ఈ చిత్రానికి ప్యాన్ ఇండియాలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ మరో చిత్రం కల్కికి సమయం ఆసన్నమైంది. జనవరి 12 నుంచి కల్కి పోస్ట్ పోన్ అయ్యింది. అసలైతే ప్రాజెక్ట్ K కల్కి ఈ రోజు జనవరి 12 సంక్రాంతి బరిలో ఉండాల్సిన సినిమా. కానీ కొన్ని కారణాల వలన దానిని పోస్ట్ పోన్ చేసారు. ఇప్పుడు ఈ చిత్రం సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. తాజాగా కల్కి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

వైజయంతి మూవీ మేకర్స్ సెంటిమెంట్ డేట్ మే 9 న కల్కి 2898ఎడి రిలీజ్ అంటూ ప్రకటించారు. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా  తెలుగు సినిమా సహా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని పెంచే సినిమా అవుతుంది అని అందరూ భావిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి కూడా రెండు భాగాలుగా విడుదల కాబోతున్నట్టుగా టాక్ ఉంది. కమల్ హాసన్, అమితాబ్, దీపికా లాంటి లెజెండ్స్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Kalki 2898 AD release date locked:

Official: Prabhas Kalki 2898 AD locks its release date

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ