Advertisementt

BB : సెకండ్ హ్యాట్రిక్ కి శ్రీకారం

Fri 12th Jan 2024 10:46 AM
balakrishna,boyapati  BB : సెకండ్ హ్యాట్రిక్ కి శ్రీకారం
BB4 on cards BB : సెకండ్ హ్యాట్రిక్ కి శ్రీకారం
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్ బాక్సాఫీసుకి హడల్. వారి కాంబో మూవీ వస్తుంది అంటే అభిమానుల్లోనే కాదు ఆడియన్స్ లోను భీభత్సమైన అంచనాలు ఉంటాయి. సింహ, లెజెండ్, అఖండ హ్యాట్రిక్స్ హిట్స్ అవడంతో ఇప్పుడు వారి కలయికలో మరో మూవీ అనగానే.. సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు ఒకటే హడావిడి. #BB4 అంటే Baap of All Combos💥💥 అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ శేశారు.

అయితే వీరి కాంబోలో #BB4 గా అఖండ కి సీక్వెల్ వస్తుందా.. లేదంటే ఫ్రెష్ స్టోరీతో మరో సినిమాని బోయపాటి ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బోయపాటి రామ్ తో తెరకెక్కించిన స్కంద ప్లాప్ తర్వాత సైలెంట్ గా ఉన్నారు. బోయపాటి బాలయ్యకి తప్ప మరో హీరోకి సెట్ కారనే అభిప్రాయం స్కందతో ప్రేక్షకుల్లో బాగా బలపడింది. ఇక మీదట బోయపాటి తో మరో హీరో సినిమా అంటే ఆలోచించాల్సిందే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే బోయపాటి మరో హీరోకి కమిట్ అవ్వలేదు.

ఆయన బాలయ్యతో మూవీ చెయ్యడానికే కథని, స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నారనే న్యూస్ నడుస్తుంది. మరి #BB4 అనౌన్సమెంట్ వస్తే గనక మాములుగా ఉండదు కదా..!

BB4 on cards:

Balakrishna Boyapati 4th Movie on cards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ