Advertisementt

గుంటూరు కారం ఓవర్సీస్ పబ్లిక్ టాక్

Fri 12th Jan 2024 06:57 AM
guntur kaaram  గుంటూరు కారం ఓవర్సీస్ పబ్లిక్ టాక్
Guntur Kaaram Overseas Public Talk గుంటూరు కారం ఓవర్సీస్ పబ్లిక్ టాక్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన గుంటూరు కారం భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. మహేష్ ని మాస్ స్టయిల్లో ప్రెజెంట్ చేసిన త్రివిక్రమ్ ఆయనతో ఎలాంటి కామెడీ డైలాగ్స్ చెప్పించారో.. అనే ఆత్రుత మహేష్ ఫాన్స్ లోనే కాదు.. త్రివిక్రమ్ సినిమాలని ఇష్టపడే అందరిలో ఉంది. హారిక హాసిని వారు తెరకెక్కించిన గుంటూరు కారం అభిమానుల అంచనాలను అందుకుందా అనేది సమీక్షలో చూద్దాం.. ముందుగా ఓవర్సీస్ లో గుంటూరు కారం ప్రీమియర్స్ పూర్తయ్యాయి, అంతేకాకుండా హైదరాబాద్ లాంటి పలు నగరాల్లో గుంటురు కారం బెన్ ఫిట్ షోస్ కంప్లీట్ అయ్యాయి. మరి ఓవర్సీస్, బెన్ ఫిట్ షోస్ టాక్ ఎలా ఉందొ ఒక్కసారి చూసేద్దాం..

గుంటూరు కారంలో మహేష్ లుక్స్ వైజ్ గా వేరే లెవల్ లో కనిపించడంతో ఆయన ఫాన్స్ థియేటర్స్ దగ్గర రచ్చ చేస్తున్నారు, ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్ తో.. కామెడీ టైమింగ్ తో కొత్త మహేష్ ని చూసాం అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం పక్కా సంక్రాంతి మూవీ అంటూ హడావిడి చేస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, కామెడీ, డైలాగ్స్ బావున్నాయి, యాక్షన్, BGM బావున్నాయని మహేష్ ఫ్యాన్ ఒకరు ట్వీట్ చేసాడు.

సగటు ప్రేక్షకులు మాత్రం గుంటురు కారం పై ఫాన్స్ ని డిస్పాయింట్ చేసే రివ్యూస్ ఇస్తున్నారు. రొటీన్ కథ, అసలు త్రివిక్రమ్ మార్క్ సినిమాలా గుంటురు కారం లేదు, మహేష్ స్థాయికి తగ్గ కథ కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు ఫెర్ఫార్మెన్స్, శ్రీలీల డ్యాన్సులు, గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచినా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, టేకింగ్, మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు అంటున్నారు. థమన్ BGM ఓకె.. మ్యూజిక్ మాత్రం నాట్ ఓకె అంటూ మరికొందరు చెబుతున్న మాట.

ఫస్ట్ హాఫ్ ఫన్, సెకండ్ హాఫ్ యాక్షన్ అన్నట్టుగా ఉంది, మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్.. డొంట్ మిస్ ఇట్ అంటూ మరికొందరు ట్వీట్లు వేస్తున్నారు. ఫైనల్ గా మహేష్ అభిమానులకే మాత్రమే అంటూ ఇంకొందరు గుంటురు కారం సినిమా చూసి స్పందిస్తున్నారు.

Guntur Kaaram Overseas Public Talk:

Guntur Kaaram Benefit show Public Talk

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ