మొదటి నుంచి గ్లామర్ గానే ప్రొజెక్ట్ అయిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఫిట్ నెస్ విషయంలో మాత్రం చాలా సీరియస్‌గా ఉంటుంది. షూటింగ్‌లో ఎంత బిజీగా వున్నా వర్కౌట్స్ మాత్రం మానదు. ఇక ఈమధ్యన బాలీవుడ్‌లో యానిమల్ సక్సెస్ తర్వాత రష్మిక మరింత హుషారుగా మారిపోయింది. బాలీవుడ్‌లో ఏ ఈవెంట్‌కి హాజరవ్వాలన్నా.. రష్మిక టూ గ్లామర్ షో చేస్తుంది. సౌత్‌లో శారీస్ కడుతూ కనిపించే రష్మిక.. బాలీవుడ్‌కి వెళ్ళగానే బుల్లి గౌన్స్‌లోకి షిఫ్ట్ అవుతుంది.
అయితే తాజాగా రష్మిక సోషల్ మీడియాలో బ్యూటీ టిప్స్ ఇస్తుంది. ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఫేస్‌కి మాస్క్ వేసుకుని కనిపించిన పిక్‌ని పోస్ట్ చేస్తూ.. బ్యూటీ టిప్స్ చెబుతుంది. తాను షూటింగ్స్‌లో ఎంత బిజీగా వున్నా ఆ సమయంలో తన అందాన్ని ఎలా కాపాడుకుంటుందో చెప్పుకొచ్చింది. పనిలో పడిపోయి.. కనీసం నిద్ర పోవడానికి సమయం లేనప్పుడు, ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నప్పుడు చర్మం దెబ్బతింటుంది. అంతేకాదు దాని నుంచి కాపాడుకోవడానికి ఒక్కోసారి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్లేందుకు సమయం కూడా ఉండదు.
అలాంటప్పుడు ఏదైనా బ్యూటీ ఫేస్ మాస్క్‌లు ధరించడం సరైన మార్గమంటూ రష్మిక బ్యూటీ టిప్స్‌ని చెప్పుకొచ్చింది. మరి అమ్మాయిలు ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వకుండా ఎలా ఉంటారు. అందుకే రష్మిక ఇన్‌స్టా పోస్ట్‌ని షేర్ చేస్తూ.. లైక్స్ మీద లైక్స్ వేసుకుంటున్నారు.