మహేష్ బాబు అందగాడు.. ఇది 100 పర్సెంట్ నిజం. ఆయనకి వయసు పెరుగుతన్న కొద్దీ అందం మరింతగా పెరుగుతుంది. ఇప్పటికీ 25 ఏళ్ళ కుర్రాడిలా యంగ్ గా కనిపిస్తారు. సినిమా సినిమాకి ఆయన లుక్స్ లో ఎలాంటి మార్పురాక పోగా.. మరింత హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నారు. గుంటూరు కారం ప్రతి పోస్టర్ లోను మహేష్ మాస్ గా ఫాన్స్ ని అలరించారు. ట్రైలర్ లోను ఎనెర్జీకి మారుపేరుగా నిలిచారు. ఇక రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను అంతే హుషారుగా కనిపించిన మహేష్ బాబు గుంటురు కారంలో రమణ పాత్రలో కనిపిస్తారనే విషయం తెలిసిందే.
తాజాగా గుంటురు కారం నుంచి మేకింగ్ వీడియో వదిలారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో మిర్చి యార్డ్ సెట్ వేసి చాలా సీన్స్, ఫైట్స్ తీశారు. మేకింగ్ అంటే సెట్స్ లో మహేష్ ఇంకా హీరోయిన్స్, డైరెక్టర్, నిర్మాతలంతా కనిపిస్తారు. మహేష్ ప్రతి సీన్ ని ఎంతో ఎనర్జిటిక్ గా పెర్ఫర్మ్ చెయ్యడమే కాదు, మేకింగ్ వీడియోలో ప్రతి షాట్ లో మహేష్ రమణ పాత్రలో చాలా స్టయిల్ గా కనిపించారు, బీడీ త్రీడీలో కనిపిస్తుందా అంటూ స్టయిల్ గా డైలాగ్ చెప్పారు. హీరోయిన్ శ్రీలీల అందంతో మహేష్ అందం పోటీ పడిందా అనేలా ఉన్నారు. మేకింగ్ వీడియోలో మహేష్ యాక్షన్ మరింతగా హైలెట్ అయ్యింది. అది చూసే మహేష్ ఫాన్స్ మన రమణగాడు ఎంత స్టయిలుగున్నాడురా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.