గుంటూరు కారం షూటింగ్ పూర్తి కాగానే దుబాయ్ వెళ్లిపోయిన మహేష్ బాబు మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే అభిమానులకి దర్శనమిచ్చారు. గుంటురు ఈవెంట్ అవ్వగానే మహేష్ బాబు తన హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలతో కలిసి ఇంటర్వూస్ ఇస్తారు, త్రివిక్రమ్ తో కలిసి ప్రమోషనల్ ఈవెంట్స్ లో కనబడతారని చాలామంది అనుకున్నారు. తీరా చూస్తే విడుదలకి మరికొన్ని గంటల సమయమే ఉంది. ఇప్పటివరకు మహేష్ కానీ శ్రీలీల ఇలా ఎవ్వరూ ఇంటర్వూస్ ఇచ్చిన దాఖలాలు లేవు.
ఇకపై గుంటురు కారం ప్రమోషన్స్ ఉండవు, ఎలాంటి ప్రెస్ మీట్ కానీ, ఇంటర్వూస్ కానీ లేవు.. సినిమా విడుదలయ్యాక మాత్రం ఓ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేస్తారు అంటూ వార్తలొస్తున్నాయి. అది పబ్లిక్ ఈవెంట్ అవ్వొచ్చు అంటున్నారు. వార్తలు రావడం కాదు.. నిజంగానే గుంటూరు కారం ప్రమోషన్స్ ఇక లేనట్టే కనిపిస్తుంది. రేపు విడుదల పెట్టుకుని ఇప్పుడు ప్రెస్ మీట్ కానీ, ఇంటర్వూస్ కానీ ఇవ్వడం సాధ్యం కాదు, అందుకే టీమ్ సైలెంట్ గా ఉందేమో.. గతంలో సర్కారు వారి పాట సమయంలో మహేష్ బాబు ఇంకా కీర్తి సురేష్ లు చాలా ఇంటర్వూస్ ఇచ్చారు. కానీ గుంటూరు కారం కి అవి మిస్ అయినట్టే.
ఈ విషయంలో మహేష్ అభిమానులు మాత్రం మహేష్-శ్రీలీల-తివిక్రమ్-మీనాక్షి కాంబో ఇంటర్వ్యూ కోసం ఎక్స్ పెక్ట్ చేసారు. అవి ఇప్పుడు లేదు అని తెలిసి డిస్పాయింట్ అవుతున్నారు.