సంక్రాంతి బరిలో ఉన్న నాలుగు సినిమాల్లో ముఖ్యంగా గుంటూరు కారం డిస్ట్రిబ్యూటర్స్-హనుమాన్ డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్యన రిలీజ్ పంచాయితి తెగడం లేదు. దిల్ రాజు vs మైత్రి మూవీ మేకర్స్ అన్నట్టుగా నైజాం లో థియేటర్స్ గొడవ ఇంకా జరుగుతూనే ఉంది. దిల్ రాజు గారు తనపై తప్పుగా వార్తలు రాశారంటూ వెబ్ సైట్స్ పై ఫైర్ అయ్యారు. మధ్యలో ప్రొడ్యూసర్ గిల్డ్ లో చర్చలు జరిగి సమస్య సద్దుమణిగింది అనుకుంటే.. రేపు రిలీజ్ కి రెడీ అయ్యాక ఇప్పుడు గుంటూరు కారం డిస్ట్రిబ్యూటర్స్ దిల్ రాజు, శిరీష్ రెడ్డి, హను మాన్ డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి మూవీస్ మధ్యన టాగ్ అఫ్ వార్ మొదలైంది.
ఈరోజు గురువారం సాయంత్రం AMB లో హనుమాన్ ప్రీమియర్స్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు అది IMAX కి మారింది అంటున్నారు. అటు నైజాం మొత్తం మీద హనుమాన్ కి చాలా తక్కువ థియేటర్స్ కేటాయించారు. అందులోను ఇప్పుడు గొడవ మొదలైంది. అగ్రిమెంట్ చేసిన వాళ్లకి ఫోన్ చేసి, క్యాన్సిల్ కొట్టమంటున్నారు.. కళ్లంట నీళ్లు కాదు రక్తం వస్తోంది.. అంతా చూస్తుంటే అంటూ హనుమాన్ డిస్ట్రిబ్యూటర్ శశి కామెంట్ చేసారు. మైత్రీ డిస్ట్రిబ్యూటర్లు సింపతీ కోసం చూస్తున్నారు. చర్చలకు రమ్మంటే రావడం లేదు.. సింగిల్ స్క్రీన్ లు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాము అంటూ ఆసియన్ సునీల్ అన్నట్లుగా తెలుస్తోంది.
ఇక మైత్రి వారు మాత్రం హనుమాన్ థియేటర్స్ క్యాన్సిల్ చేయించమంటున్నారు. శిరీష్ రెడ్డి బెదిరిస్తున్నారు, ఇదెక్కడి పద్దతి అంటూ మాట్లాడడం, ఇదంతా చూస్తుంటే ఈ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. వరంగల్ కి హనుమాన్ కటౌట్ పంపించి థియేటర్ దగ్గర పెట్టిస్తే దానిని తీసి రోడ్డు మీద పడేశారంటూ మైత్రి శశి ఆరోపణలు మధ్యన ఈరోజు సాయంత్రం హనుమాన్ ప్రీమియర్స్ పై సస్పెన్స్ నెలకొంది.