మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి సినిమాలకి, నటనకి ఫుల్ స్టాప్ పెడుతుందా? నాగబాబు ఇంటి కోడలిగా పద్దతిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుందా? అనే కన్ఫ్యూషన్ మెగా ఫాన్స్ లో ఉంది. వరుణ్ తేజ్ తో వివాహమయ్యాక ఎలాంటి ప్రాజెక్ట్స్ కి సైన్ చెయ్యని లావణ్య బయట ఎప్పుడు కనిపించినా పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది. పెళ్ళికి ముందు మోడరన్ లుక్ లో కనిపించేందుకు ఇష్టపడిన లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత డీసెంట్ లుక్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. పెళ్ళికి ముందు లావణ్య నటించిన ఓ వెబ్ సీరీస్ ఇప్పుడు విడుదలకి రెడీ అయ్యింది.
బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్ అప్పటినుంచి ఇప్పటివరకు విహార యాత్రల్లోనే ఎక్కువగా కనిపించాడు కానీ.. అతని నుంచి ఓ సినిమా కానీ, వెబ్ సీరీస్ అప్ డేట్ కానీ బయటికి రాలేదు. కానీ ఇన్నాళ్ళకి అభిజిత్ నుంచి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సీరీస్ రాబోతుంది అది కూడా మెగా చిన్న కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి అభిజిత్ మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేసాడు. ఇది డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి విడుదల కాబోతుంది. తాజాగా మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ టీజర్ ని విడుదల చేసారు మేకర్స్.
మరి ఈ సీరీస్ సక్సెస్ అటు లావణ్య త్రిపాఠికి, ఇటు బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ఇద్దరికి ఇంపార్టెంట్. లావణ్య దీని తర్వాత కొత్తగా ఏ ప్రాజెక్ట్ సైన్ చేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.