బిగ్ బాస్ సీజన్ 7 గత నెల డిసెంబర్ 17 నే గ్రాండ్ ఫినాలే తో ముగిసింది. కొన్ని సీజన్స్ నామ మాత్రంగానే స్టార్ లో ప్రసారమైనా.. ఈసీజన్ మాత్రం సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యింది. స్టార్ మాలోనే కాకుండా.. రెండేళ్ల క్రితం హాట్ స్టార్ లో 24/7 అంటూ ఓటిటి బిగ్ బాస్ ని మొదలు పెట్టారు. అయితే ఎందుకో ఏమో.. గత ఏడాది బిగ్ బాస్ ఓటిటీని కంటిన్యూ చెయ్యలేదు. ఓటిటి సీజన్ 1 డిసాస్టర్ అవ్వడంతోనే యాజమాన్యం ఓటిటి వెర్షన్ ఆపేసింది అనుకున్నారు.
ఈ ఏడాది బిగ్ బాస్ ఓటిటి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, ఫిబ్రవరిలోనే ఆ ఓటిటి వెర్షన్ మొదలవుతుంది, దాని కోసం కంటెస్టెంట్స్ ఎంపిక కూడా మొదలయ్యింది, ఈ సీజన్ లోకి మళ్ళీ యావర్ ని తీసుకోమని సీజన్ 7 టాప్ 3 కంటెస్టెంట్ శివాజీ సామజిక మాధ్యమాల ద్వారా రిక్వెస్ట్ కూడా చేసాడు. దానితో ఈ ఏడాది ప్రసారం కానున్న ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నిర్వహకులు రద్దు చేసినట్లు తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరోవైపు అన్నపూర్ణ స్టూడియో లో బిగ్ బాస్ సెట్ ని మరో ఛానెల్ లో ప్రసారం కాబోయే కొత్త షో కోసం బుక్ చేసుకుందని చెబుతున్నారు. బిగ్ బాస్ ఓటిటి ఆపెయ్యబట్టే ఈ సెట్ ని రెంట్ కి ఇచ్చారని గుసగుసలాడుకుంటున్నారు.