ధమాకా హిట్ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు క్యూట్ బ్యూటీ శ్రీలీల కి హిట్ తగల్లేదు. ధమాకా సక్సెస్ లో 100 శాతం క్రెడిట్ పట్టుకుపోయిన శ్రీలీల క్రేజ్ అప్పటినుంచి టాలీవుడ్ ని చుట్టేసింది. చిన్నా, పెద్ద హీరోలంతా శ్రీలీల వైపే చూసారు. దానితో శ్రీలీల డైరీ ఫుల్లయ్యింది. పెరఫార్మెన్స్ పరంగా, లుక్స్ వైజ్ గా, డాన్స్ ల విషయంలోనూ శ్రీలీల తనవంతు కష్టపడుతుంది. కానీ సక్సెస్ మాత్రం అమ్మడుకి ఆమడ దూరానే ఆగిపోతుంది. ఒకటా రెండా వరసగా మూడు ప్లాప్ లు ఆమెని చుట్టేసాయి.
గత ఏడాది భగవంత్ కేసరి ఆమెకి బూస్ట్ ఇచ్చినా.. అందులో ఆమెది హీరోయిన్ రోల్ కాదు. ఇక రామ్, వైష్ణవ్ తేజ్, నితిన్ వరసగా శ్రీలీల కి షాకిచ్చారు. గత ఏడాది అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్.. ఇప్పుడు జనవరి నెల వరకు శ్రీలీల నటించిన సినిమాలు వరసబెట్టి ఆడియన్స్ ముందుకు వచ్చాయి, వస్తున్నాయి. రామ్ స్కంద, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, నితిన్ ఎక్సట్రార్డినరీ మ్యాన్ మూవీస్ శ్రీలీలని ఆమె అభిమానులని పూర్తిగా నిరాశపరిచాయి.
మరి రేపు శుక్రవారం జనవరి 12 న విడుదల కాబోతున్న గుంటూరు కారంలో శ్రీలీల ఫస్ట్ టైమ్ స్టార్ హీరో మహేష్ తో వర్క్ చేసింది. ఈ చిత్రంలో శ్రీలీల లుక్స్, ఆమె గ్లామర్, డాన్స్ ఎలా ఉండబోతున్నాయో ట్రైలర్ లోను, పాటల్లోనూ శాంపిల్ చూసేసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను శారీతో అలరించిన శ్రీలీలకి లక్ ఎంతుందో.. మహేష్ ఆమెకి ఎంతవరకు హిట్ ఇస్తాడో అనేది ఆసక్తికరంగా మారగా.. శ్రీలీల సక్సెస్ కోసం వెయిటింగ్ అంటూ ఆమె అభిమానులు నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.
చూద్దాం శ్రీలీల కి గుంటూరు కారం ఎంతవరకు హెల్ప్ అవుతుందో అనేది. ఇక ఈ చిత్రం తర్వాత శ్రీలీల విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి VD13 కి షిఫ్ట్ అవ్వనుంది.