రేపు శుక్రవారం విడుదల కాబోతున్న గుంటూరు కారం సినిమాకి బెన్ ఫిట్ షోస్ కి అలాగే టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం గుంటూరు కారం నిర్మాతలకి అనుమతులు ఇచ్చేసింది. నిన్న మంగళవారమే తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయమై జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, గుంటూరు కారం బెన్ ఫిట్ షోలకు కూడా స్పెషల్ గా అనుమతి ఇచ్చింది. ఈ నెల 12న అర్థరాత్రి 1 గంట బెన్ ఫిట్ షోకు రాష్ట్రంలో 23 చోట్ల ప్రదర్శనలకు అనుమతి, గుంటూరు కారం ఆరో షో ప్రదర్శనకు అనుమతి ఇవ్వడమే కాకుండా ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోకు అనుమతి ఇచ్చింది.
ఇక ఇప్పుడు ఆంధ్ర కూడా గుంటూరు కారం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు జారీ చేసింది. ఈరోజు వరకు గుంటూరు కారం నిర్మాతలు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఏపీ గవర్నమెంట్ తో మంతనాలు జరిపారు. ఇక ఈరోజు బుధవారం ఆంధ్ర ప్రభుత్వం కూడా గుంటూరు కారం టికెట్ రెట్స్ పెంచుకోవడానికి స్పషల్ గా అనుమతినిస్తూ జీవో జారీ చేసింది, మల్టిప్లెక్స్, సింగిల్ స్క్రీన్ ఇలా అన్ని థియేటర్లలో టికెట్ పై రూ.50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, ఈ నెల 12 నుంచి పది రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులబాటు కలిపించింది.