Advertisementt

నిన్న గుంటూరు నేడు అన్నపూర్ణ స్టూడియోస్

Wed 10th Jan 2024 06:44 PM
mahesh babu,tamanna  నిన్న గుంటూరు నేడు అన్నపూర్ణ స్టూడియోస్
Yesterday Guntur today is Annapurna Studios నిన్న గుంటూరు నేడు అన్నపూర్ణ స్టూడియోస్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ పూర్తి చేసేసి డిసెంబర్ 27 న తన ఫ్యామిలీతో పాటుగా న్యూ ఇయర్ వేడుకల కోసం దుబాయ్ వెళ్లారు. ఆ వెకేషన్స్ లో కూడా మహేష్ బాబు ఓ యాడ్ షూట్ పూర్తి చేసేసారు. ఇక మూడు రోజుల క్రితమే మహేష్ బాబు దుబాయ్ నుంచి ఫ్యామిలీతో సహా హైదరాబాద్ కి వచ్చేసారు. శనివారం హైదరాబాద్ కి వచ్చిన మహేష్ బాబు ఆ రోజు సాయంత్రమే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళాల్సి ఉండగా.. శనివారం ఆ ఈవెంట్ వాయిదాపడింది. నిన్న మంగళవారం గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

మహేష్ బాబు మంగళవారం హీరోయిన్స్, నిర్మాత, డైరెక్టర్ లతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం చేరుకొని అక్కడ నుంచి గుంటూరు కి వెళ్లారు. అక్కడ గుంటూరు లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ బాబు ఆ తర్వాత హైదరాబాద్ కి చేరుకున్నారు. మళ్ళీ మహేష్ ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ యాడ్ షూట్ కి హాజరయ్యారు. ఈ యాడ్ షూట్ లో మహేష్ తమన్నా కలిసి పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఇది చూసిన మహేష్ అభిమానులు నిన్న గుంటూరు నేడు అన్నపూర్ణ స్టూడియో కి మహేష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Yesterday Guntur today is Annapurna Studios:

Mahesh Babu, Tamanna Bhatia New Ad Shooting

Tags:   MAHESH BABU, TAMANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ