గత రాత్రి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు తన తండ్రిని తలుచుకుని అభిమానులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై తల్లి, తండ్రి అన్నీ మీరే, నన్ను మీరే చూసుకోవాలంటూ మహేష్ ఇచ్చిన స్పీచ్ కి ఆయన అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకులు అంతా చలించిపోయారు. ఇక మహేష్ భార్య నమ్రత ఈరోజు అదే సూపర్ స్టార్ అభిమానులని ఉద్దేశించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసారు.
మహేష్ సూపర్ స్టార్ ఫాన్స్ గురించి మాట్లాడే చివరి వ్యక్తిని బహుశా నేనే కావొచ్చు, మన రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్ ఫాన్స్ ఆయనపై అపారమైన ప్రేమని చూపిస్తున్నారు. ప్రతిసారి ఆయనకి సపోర్ట్ గా ఉన్నారు. మీరు మద్దతుగా నిలుస్తూ ఆయన మరింత కష్టపడేలా చేసారు. మా సొంతూరు గుంటూరు లో మీరు చూపించిన అపారమైన ప్రేమని చూసి గర్వంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను.
అభిమానులకి మహేష్ ఓ ఎమోషన్. మీ ప్రేమని కుటుంభ సభ్యులుగా అందరం ఆదరిస్తాం. ఈ ప్రేమ ఇలాగే మనం జీవించి ఉన్నంతకాలం ఉండాలని కోరుకుంటున్నాను, మీకు ఎప్పటికి మా ప్రేమని ప్రతిఫలంగా ఇస్తాము, ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తున్న మీ ప్రేమకి సర్వదా కృతఙ్ఞతలు, మీ ప్రేమని ఎప్పటికీ గుండెల్లో నింపుకుంటాను అంటూ నమ్రత ఇన్స్టా లో సూపర్ స్టార్ ఫాన్స్ ని ఉద్దేశించి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.