Advertisementt

SSMB29 పనులు మొదలయ్యాయా..

Wed 10th Jan 2024 01:38 PM
ssmb29  SSMB29 పనులు మొదలయ్యాయా..
Has SSMB29 work started silently? SSMB29 పనులు మొదలయ్యాయా..
Advertisement
Ads by CJ

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. శుక్రవారం సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కాబోతున్న గుంటూరు కారంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ పండగకి విడుదలయ్యే అన్ని సినిమాల్లో గుంటూరు కారంపై విపరీతమైన హైప్ ఉంది. ఇక ఈచిత్రం విడుదల కాగానే మహేష్ రిలాక్స్ అవుతారు. మరి రాజమౌళి తో చెయ్యబోయే SSMB29 కోసం రెడీ అవ్వాల్సి ఉంది. అటు రాజమౌళి కూడా గత ఏడాదిగా SSMB29 స్క్రిప్ట్ విషయంలో అలాగే లొకేషన్స్ సెట్ చేసుకునే విషయంలో తలమునకలై ఉన్నారు.

ఈ చిత్రం కి సంబందించిన పనులని దర్శకధీరుడు రాజమౌళి సైలెంట్ గా మొదలు పెట్టారనిపించేలా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫారెస్ట్ యాక్షన్ డ్రామా కథాంశంతో ఇంటర్నేషనల్ స్థాయిలో రూపొందుతుంది కాబట్టి ఈ చిత్రంలో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఉన్న టాప్ సెలబ్రిటీస్ ని ఇందులో నటింపజేయాలనుకుంటున్నారు. అందుకోసమే రాజమౌళి త్వరలోనే ముంబైకి వెళ్ళబోతున్నారని సమాచారం. నటుల ఎంపిక కోసం రాజమౌళి ఓ వర్క్ షాప్ నిర్వహిస్తారని అంటున్నారు.

ఇప్పటికే SSMB29 లో మహేష్ బాబు స‌ర‌స‌న ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ కీలక పాత్ర కోసం ఎంపికైంది అని టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది.  ఇక ఈ చిత్రం కోసం కనివిని ఎరుగని బడ్జెట్ పెడుతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. హాలీవుడ్ సినిమా త‌ర‌హాలోనే ప్ర‌పంచ స్థాయిలో మ‌హేష్ సినిమాని రిలీజ్ చేయాల‌న్న ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే రాజమౌళి తండ్రిగారు విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రెడీ చేసారు. ఇక ఎప్పుడెప్పుడు SSMB29 మొదలవుతుందా అని మహేష్ అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.

Has SSMB29 work started silently?:

SSMB29 update 

Tags:   SSMB29
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ