హైదరాబాద్ నుంచి గుంటూరు కారం టీమ్ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని గుంటూరుకి వెళ్లి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. హైదరాబాద్ లో శనివారం జరగాల్సిన ఈవెంట్ పోలీస్ పర్మిషన్ దొరకని కారణముగా హడావిడిగా దానిని గుంటూరుకి షిఫ్ట్ చేసినా.. ఈవెంట్ నిర్వాహకులు అభిమానుల కోసం అన్ని ఏర్పాట్లు చేసారు. హైదరాబాద్ నుంచి మహేష్, శ్రీలీల, మీనాక్షి, త్రివిక్రమ్, చినబాబు, థమన్, నాగ వంశీ, దిల్ రాజులు ఫ్లైట్ లో వెళ్లారు. ఇంకేంటి ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు జరుగుతుంది అనుకున్నారు.
కానీ ఏడు గంటలకి మొదలైన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేలాదిమంది అభిమానుల నడుమ ఎనిమిదిన్నరకే ముగించేశారు. ఇంత హడావిడిగా ఈవెంట్ ని ముగించడం పట్ల.. సామజిక మద్యమాల్లో ఈవెంట్ ని వీక్షించినవారు షాకయ్యారు. అయితే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత త్వరగా ముగించడానికి ప్రత్యేకమైన కారణమే కనిపిస్తుంది. అది సూపర్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున ఈవెంట్ కి తరలి రావడమే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేలాదిగా అభిమానులు హాజరయ్యారు. దానితో సాయంత్రమయ్యేసరికి ఎంట్రన్స్ గేటు వద్ద ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోటెత్తారు. ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున పొగవడంతో.. ప్రధాన గేటును తెరవాల్సి వచ్చింది. అప్పుడు ఫాన్స్ ఒకరినొకరు తోసుకుంటూ.. లోపలి రావడంతో ఆ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది.
దానితో అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప బ్యారికేడ్ అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకట్రావు కాలి మీద పడింది. ఇనుప బారికేట్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కాలు విరిగింది. దానితో వెంటనే ఆయన్ను గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. మహేష్ అభిమానులు అంచనాకు మించి హాజరవడంతో ఇంకా కొంతమంది ఫాన్స్, పోలీసులు కూడా ఈ తోపులాటలో గాయపడినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈవెంట్ వేదికకి దగ్గర్లోని రేకుల షెడ్డు మీదకు ఎక్కిన అభిమానుల దెబ్బకు.. ఆ షెడ్డు కూలింది. అక్కడ కొంతమంది గాయపడ్డారు.
గుంటూరు లో ప్రీరిలీజ్ వేడుక సమీపంలో హైవే పై భారీగా టాఫిక్ పెరిగింది. అదే సమయంలో టూవీలర్లు ఢీ కొన్న ఉదంతంలో మరికొంతమంది అభిమానులు గాయపడ్డారు. ఇదంతా కేవలం హడావిడిగా ఫంక్షన్ నిర్వహించడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరిగాయని, అందుకే మహేష్ ఇంకా టీమ్ త్వరగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ముగించేసినట్లుగా తెలుస్తుంది.