బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీకి భజన చేస్తూ స్పై బ్యాచ్ గా ప్రొజెక్ట్ అయిన పల్లవి ప్రశాంత్, యావర్ లు బయటికి వచ్చాక కూడా శివాజీకి భజన చెయ్యడం ఆపడం లేదు. తాను శివాజీ అన్న వలనే విన్నర్ అయ్యాను అంటూ పల్లవి ప్రశాంత్ సందర్భం వచ్చినప్పుడల్లా.. శివాజీని ఎత్తుతూనే ఉన్నాడు. బిగ్ బాస్ లో, బిగ్ బాస్ ఫినాలే రోజున ఇలా ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్, యావర్ లు శివాజీ ని పొగుడుతూనే ఉన్నారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలయ్యాక శివాజీ ఇంటికెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు.
అదంతా ఒక ఎత్తైతే స్టార్ మా వారు సంక్రాంతికి స్పెషల్ ఈవెంట్ చేసారు. ఈ ప్రోగ్రాం కి నా సామిరంగా అంటూ నాగార్జున స్పెషల్ అతిధిగా రాగా.. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అలాగే సీరియల్ ఆర్టిస్ట్ లు ఈ ప్రోగ్రాంలో రచ్చ చేశారు. ఇక శివాజీ పట్టు పంచె కట్టుకుని పద్దతిగా రాగా.. పల్లవి ప్రశాంత్ తనకి పెద్దన్న లేరు.. మీరే నాకు అన్నా, మీ వలనే నేను బిగ్ బాస్ గెలిచాను అంటూ శివాజీని పొగిడెయ్యగా.. యావర్ ఒక్క అడుగు ముందుకేసి చేతికి బంగారు కడియం తొడిగి నాకు మీరే అమ్మా, నాన్నా అంటూ శివాజీని ఎత్తుకున్న ప్రోమో చూసాక ఇక శివాజీ భజన ఆపండ్రా అంటూ కామెడీగా స్పందిస్తున్నారు నెటిజెన్స్.