సింగర్ సునీత కొడుకు ఈమధ్యనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారీ నౌక అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. జనవరి 1 న విడుదలైన ఈచిత్రాన్ని అంతగా ఆడియన్స్ పట్టించుకోలేదు. ఇక సునీత రెండో పెళ్లిపై సునీత కొడుకు ఆకాష్ చేసిన కామెంట్స్ ఈమధ్యన వైరల్ గా మారాయి. తన తల్లి మొదట్లో ఇండస్ట్రీలో ఉండే ఒత్తిడిని భరిస్తూనే మరోపక్క నన్ను, చెల్లిని, అమ్మమ్మను, తాతయ్యను చూసుకుంది. మేము అందరం కలిసి ఉండేవాళ్ళం. రెండో పెళ్లి అయ్యాక కూడా నాన్న ఇంటికి వస్తూ ఉంటారు. రామకృష్ణ గారితో(సునీత రెండో భర్త) నాన్న ఫ్రెండ్లీగా ఉంటారు.
అమ్మ రెండో వివాహం విషయంలో చాలా భయపడింది. అప్పుడు రామకృష్ణ గారు అంటే మీకు ఇష్టమేనా అని నేను అమ్మను అడిగాను. ఇష్టమే అని అమ్మ చెప్పింది. అమ్మ చాలా కాలంగా ఎమోషనల్ సపోర్ట్ మిస్ అయ్యింది. ఆమె సంతోషమే మాకు ముఖ్యం అని చెప్పాడు.
అయితే సునీత మ్యాంగో రామ్ ని వివాహం చేసుకుంది 2021 జనవరి 9 నే. అంటే ఇదే రోజు. ఈరోజు సునీత తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నా జీవితం మొత్తం మీద అద్భుతమైన క్షణమిదే అంటూ ఎమోషనల్ గా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. మరి సునీత ఎంత సంతోషంగా లేకపోతే ఇంత మధురంగా స్పందిస్తుంది అంటున్నారు నెటిజెన్స్. రామ్ ని వివాహమాడాక సునీత ఎక్కువగా సోషల్ మీడియాలో కనబడుతుంది. ఏదైనా ట్రిప్స్ లోనో.. లేదంటే ఫామ్ హౌస్ లోనో.. చెట్ల మధ్యన ఆనందంగా గడిపేస్తుంది.