బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక వెండితెర మీద క్రేజీ ఆఫర్స్ తో వెలిగిపోదామని, ఏదో పొడిచేద్దామని కలలు కని.. హౌస్ లోకి వెళుతున్న వారు.. బయటికి వచ్చాక ఓ నెలరోజులు అటు ఇటుగా హడావిడి చేసేసి మాయమైపోతున్నారు. అది కూడా కేవలం టాప్5 కంటెస్టెంట్స్, విన్నర్ ఇంకా రన్నర్ లు ఆ నెల రోజులు హడావిడి చేస్తారు. మిగతావారు అంటే మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి ఇంటిదారి పట్టేవారు డిప్రెషన్ లోకి వెళ్లివస్తున్నారు. ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. ఇక విన్నర్స్ గా నిలిచినవారు కూడా సినిమాలు ఓపెనింగ్ లు చేసెయ్యడం.. ఆ తర్వాత వాటిని విడుదల చెయ్యడానికి నానా కష్టాలు పడడం.
శివ బాలాజీ, కౌశల్, రాహుల్, అభిజిత్, సన్నీ, బిందు మాధవి, రేవంత్, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వీరంతా ఏదో పీకేస్తారు అనుకుంటే.. ఏమి చెయ్యలేక సైలెంట్ అవుతున్నారు. అభిజిత్ సీజన్ అప్పుడు మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక స్పెషల్ సాంగ్స్, రన్నర్ అఖిల్ తో సినిమా, సీరీస్ అని హడావిడి చేసింది. ఇప్పుడు కనబడకుండా పోయింది. ఆ తర్వాత సన్నీ కూడా వరసబెట్టి సినిమాలు మొదలెట్టాడు. ఒక్క సినిమా హిట్ అవ్వలేదు, ఇప్పుడు ఈ సీజన్ నుంచి బయటికి వచ్చిన శోభా శెట్టి, తేజ, అమర్ దీప్, శివాజీ, యావర్ ఇలా అందరూ తెగ హడావిడి చేస్తూ సినిమా ఈవెంట్స్ లో కనబడుతున్నారు.
విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే జైలుకెళ్లొచ్చాక సైలెంట్ అయ్యాడు, లేదంటే మనోడు ఓవరేక్షన్ చూడలేకపోయారు. రీసెంట్ గా సందీప్ సినిమా ఈవెంట్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మొత్తం హంగామా చేసారు. అమర్ దీప్ అయితే నాకు ఆ సినిమాలో ఆఫర్స్ వచ్చాయంటూ చెబుతున్నాడు. శివాజీకి మాత్రం 90s వెబ్ సీరీస్ హిట్ కట్టబెట్టింది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా శివాజీ బిజీ అవుతాడో, లేదో.. చూడాలి. ఏదైనా ఈ హడావిడి మాత్రం మరో నెల కనబడుతుంది. ఆ తర్వాత ఎప్పటిలాగే అందరూ సైలెంట్ అవ్వాల్సిందే.