మెగా అభిమానులు ఉడికిపోతున్నారు. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో మొదలు పెట్టిన గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో అటుంచి ఆ సినిమాకి సంబందించిన అప్ డేట్ కూడా ఇవ్వడం లేదు. దివాళికి గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ అంటూ ఊరించి పోస్ట్ పోన్ చేసారు. ఇప్పటివరకు ఆ విషయం గురించి టీమ్ నుంచి ఎలాంటి చడీచప్పుడు లేదు. అటు చూస్తే ఆర్.ఆర్.ఆర్ మరో హీరో ఎన్టీఆర్ దేవర ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైపోయింది.
నిన్న సోమవారం దేవర గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో అభిమానులు డిస్పాయింట్ అవుతూ #GameChanger హ్యాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూట్ మొదలై రెండున్నరేళ్లు గడిచిపోయినా.. మేకర్స్ ఇంకా ఇంకా షూటింగ్ గురించి కానీ, రిలీజ్ డేట్ గురించి కానీ చెప్పకుండా నాన్చుతూనే ఉన్నారు. దానితో మెగా ఫాన్స్ లో ఆందోళన ఎక్కువైపోతోంది.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే మొదలయ్యింది. రామ్ చరణ్-కియారాలపై కీలక సన్నివేశాలను శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఓ నాలుగు రోజులు పాటు జరిగే ఈ షెడ్యూల్ ని సంక్రాంతికి చిన్న బ్రేక్ తీసుకుని తర్వాత యధావిధిగా కొనసాగుతుంది అని తెలుస్తోంది.