కొన్ని రోజుల నుంచి తమ సినిమాల ప్రెస్ మీట్స్ లో స్టార్ హీరోలు డాన్సులు చేస్తూ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళుతున్నారు. గతంలో మహేష్ బాబు తన అభిమానుల్లో ఊపు తీసుకురావడానికి సర్కారు వారి పాట ఈవెంట్ లో స్టేజ్ పై కాలు కదిపారు. ఇక రీసెంట్ గా యానిమల్ ఈవెంట్ లో అనిల్ కపూర్ మహేష్ ని డాన్స్ చెయ్యమని ఒత్తిడి చేశారు. కుర్ర హీరోలు సరే సరి. విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ లాంటి యువ హీరోలు హీరోయిన్స్ తో కలిసి సినిమాలపై హైప్ తేవడానికి స్టేజ్ పై స్టెప్స్ వేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ సీనియర్ హీరోలని తగులుకుంది. మెగాస్టార్ బాలయ్య ఏమోకానీ.. వెంకటేష్ తన సైంధవ్ మూవీ కి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా హీరోయిన్స్ తో కలిసి డాన్సులు చేస్తున్నారు. నిన్నగాక మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కాదు, Venky75 సెలెబ్రేషన్స్ లోను ఇలా ఎక్కడ చూసినా వెంకటేష్ స్టేజ్ పై డాన్స్ చెయ్యడం చూసిన వారు.. సినిమాలని ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలంటే ఇలా డాన్సులు చెయ్యక తప్పేలా లేదు, అది సీనియర్ హీరోలకి కూడా తప్పలేదు అంటున్నారు,
మరి నాగార్జున నా సామిరంగా ప్రమోషన్స్ లో కూడా ఇలాంటివి ఎమన్నా చేస్తారో, లేదో.. చేస్తారు ఎందుకంటే ఆయన బిగ్ బాస్ స్టేజ్ పై చాలాసార్లు డాన్స్ చేసారు. మరి ఇప్పుడున్న ట్రెండ్ లో సినిమాలపై క్రేజ్ తేవాలంటే ఇలాంటివి కొత్తగా ట్రై చెయ్యాల్సిందే కదా!