తనపై తప్పుడు రాతలు రాస్తే చూస్తూ ఊరుకోను అంటూ రెండు గాసిప్ వెబ్ సైట్స్ (సినీజోష్ కాదు) ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆగ్రహంతో మీడియా ముఖంగా తాట తీస్తాను అంటూ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడకముందే కొంతమంది మీడియా వారికి ఆయన వార్నింగ్ ఇచ్చిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. అందులో దిల్ రాజు చాలా కోపంతో పిచ్చి పిచ్చిగా రాస్తే.. గుర్తుపెట్టుకోండి అని వార్న్ చేస్తున్న సమయంలో తనని శాంత పరచడానికి వచ్చిన ఓ పిఆర్వోని ఏం పీకుతున్నారు మీరు అంటూ ఊగిపోయిన వీడియో అది.
టాప్ వెబ్ సైట్స్ అనుకునే కొంతమంది సినిమా వాళ్లపై గాసిప్స్ రాసుకుంటూ వాళ్ళని ఇరిటేట్ చెయ్యడమే కాదు.. వారేమన్నా అంటే వాటిని మార్చి రాస్తూ పబ్బం గడుపుకుంటాయని సినిమా సెలబ్రిటీస్ చాలామంది వాళ్లపై ఫైర్ అవుతూనే ఉంటారు. కానీ మళ్ళీ తమ సినిమాలు రిలీజ్ సమయానికి వాళ్ళనే పిలిచి కూర్చోబెట్టి మరీ ఇంటర్వూస్ ఇస్తూ ఉంటారు. ఇది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం అయ్యిపోయింది. కాని ఈసారి దిల్ రాజు గారి కోపం చూస్తే వేరే లెవల్ అన్నట్టుగా ఉంది. చూద్దాం ఇకపై ఏం జరగబోతుందో అనేది.