అన్న ఇంటికి వెళ్లేందుకు పర్మిషన్ కోరడమే ఏ చెల్లికైనా ఒక దౌర్భాగ్యపు పరిస్థితి. అలాంటిది పర్మిషన్ అడిగినా నిరాకరించడమంటే.. ఇక అంతకన్నా దరిద్రం మరొకటి ఉంటుందా? పొద్దున లేస్తే అక్కచెల్లెమ్మలతో తన ప్రసంగాన్ని ప్రారంభించే వైఎస్ జగన్.. తన సొంత చెల్లి విషయంలో చేసిన నిర్వాకమిది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజమట. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా నడుస్తున్న యవ్వారం ఇదే. వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహాన్ని జరిపించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు అన్న అయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి షర్మిల వెళదామనుకున్న విషయమూ తెలిసిందే.
వద్దు.. బీజేపీ వాళ్లు డౌట్ పడతారు..!
వెళదామనుకున్నాక.. వెళ్లి వచ్చాక నడుమ ఏం జరిగిందన్నదే బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఏపీలో మాత్రం ఈ విషయం గుప్పుమన్నది ఇక అంతే.. ప్రతి ఒక్కరూ ఇలా జరిగిందా? అని బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. షర్మిల నుంచి తాను కార్డు ఇవ్వడానికి అన్నను కలవాలనుకుంటున్నానని.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోనుచేసి అపాయింట్‌మెంట్ కోరారట. కానీ జగన్ మాత్రం.. షర్మిల కాంగ్రెస్‌లో పార్టీలో చేరిందని.. ఇప్పుడు ఆమె వచ్చి తనను కలిస్తే బీజేపీ వాళ్లు తనపై డౌట్ పడతారని వద్దన్నారట. ఈ విషయం షర్మిలకు చెప్పలేక జగన్‌కు అరకు టూర్ ఉందని తర్వాత చూద్దామని చెప్పారట సెక్యూరిటి.
సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు?
ఇక తనను రానివ్వకుంటే సెక్యూరిటీకి కార్డు ఇచ్చి వెళ్లిపోతానని చెప్పారట. షర్మిల వచ్చి తన కుమారుడి పెళ్లి కార్డు సెక్యూరిటీకి ఇచ్చి వెళితే పరువు పోతుందని ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో చెల్లికి అపాయింట్‌మెంట్ ఇచ్చారట. ఒక్కగానొక్క చెల్లి.. తన కుమారుడి వివాహం చేస్తుంటే అండగా ఉండి అన్నీ తానవ్వాల్సిన అన్న కనీసం పిలుపులకు వస్తే కూడా అపాయింట్‌మెంట్ నిరాకరించారనే చర్చనీయాంశంగా మారింది. ఒక సీఎమ్మే ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితేంటి? అసలు జగన్ సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక సీఎం స్థాయిలో ఉండి బీజేపీ వాళ్లకు భయపడమేంటని ప్రశ్నిస్తున్నారు. పోనీ జగన్‌కు కుదరకున్నా భారతి ఉంటారు కదా.. ఆమెకైనా ఇవ్వాలని చెప్పొచ్చు కదా. అదీ లేదు. మొత్తానికి ఈ వ్యవహారమంతా ఆ నోటా ఈ నోటా పడి ఏపీలో కాక రేపుతోంది.