ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది. డిసెంబర్ 22 న విడుదలైన సలార్ సూపర్ సక్సెస్ అవడంతో టీమ్ మొత్తం హ్యాపీ. ఇక ప్రభాస్ మోకాలి సర్జరీతో కోలుకుని రేపు 10 నుంచి కల్కి ఏడి 2898 షూటింగ్ కి హాజరు కాబోతున్నారు. అసలైతే కల్కి AD 2898 జనవరి 12 నే అంటే రేపు శుక్రవారమే విడుదల కావాల్సి ఉంది. గత ఏడాది శివరాత్రికే కల్కి డేట్ లాక్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో కల్కి AD 2898 ని సమ్మర్ కి షిఫ్ట్ చేసారు.
అయితే ఇప్పుడు వైజయంతి మూవీస్ వారు తమకి సెంటిమెంట్ గా కలిసొచ్చే మే 9 నే కల్కి ఏడి 2898 ని విడుదల చెయ్యాలని ఫిక్స్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. అధికారికంగా ఈ డేట్ ప్రకటించలేదు కానీ.. కల్కి ఏడి 2898 ని మే 9 న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. వైజయంతి మూవీస్ వారు తెరకెక్కించిన మెగాస్టార్ చిరు జగదేకవీరుడు అతిలోకసుందరి 1990 ఇదే రోజు అంటే మే 9 న విడుదల చెయ్యగా.. వైజయంతి వారు భారీ బ్లాక్ బస్టర్ కట్టబెట్టిన రోజు, కేవలం ఆ చిత్రమేకాదు.. దర్శకుడు నాగ్ అశ్విన్ కి మహానటి తెచ్చిన పేరు అంత ఇంతా కాదు. మహానటి ని కూడా మే 9 నే విడుదల చేసి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఆ డేట్ కే కల్కిని దింపాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట.
తమకి విజయాన్ని అందించిన మే 9 సెంటిమెంట్ తో వారు ఇప్పుడు ప్రభాస్ కల్కిని విడుదల చెయ్యాలని డిసైడ్ అవుతున్నారట. అదే డేట్ ప్లానింగ్ తో కల్కి లో నటిస్తున్న సూపర్ స్టార్స్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరులతో ఇంటర్నేషనల్ గా ప్రమోషన్స్ ని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారట.