Advertisementt

అప్పుడే ఫీలైతే ఎట్టా..

Tue 09th Jan 2024 10:15 AM
meenakshi chaudhary  అప్పుడే ఫీలైతే ఎట్టా..
What if it feels like that.. అప్పుడే ఫీలైతే ఎట్టా..
Advertisement
Ads by CJ

గురూజీ.. గుంటురు కారంలో మీనాక్షి చౌదరికి ఎంత ఐడెంటిటీ ఇస్తారు అనే విషయంలో నిన్నమొన్నటి వరకు చాలా మందిలో అనుమానాలున్నాయి. ఇప్పుడు ట్రైలర్ వచ్చాక ఆ అనుమానాలు మరింతగా పెరిగాయి.. ఇది మీనాక్షి చౌదరి అభిమానుల్లో ఉన్న ఆందోళన. గుంటురు కారం మూవీలోకి మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా ఎంటర్ అయ్యింది. అయితే కొన్ని సినిమాల నుంచి త్రివిక్రమ్ తన సినిమాల్లో సెకండ్ హీరోయిన్ కి ప్రాధాన్యత తగ్గించేస్తున్నారు. ఇప్పుడు మీనాక్షి విషయంలో కూడా ఏదైనా తేడా జరుగుతుందా అనుకుంటున్నారు.

తీరా గుంటూరు కారం ట్రైలర్ లో మీనాక్షికి ఒక్క సీన్, ఒక్క డైలాగ్ మాత్రమే ఇచ్చారు. ట్రైలర్ లో సగ భాగం స్పేస్ శ్రీలీల కే ఇచ్చారు. మహేష్ తో రొమాన్స్ చేసే అవకాశం ఇచ్చారు. కానీ మీనాక్షిని ఒక్క డైలాగ్ తోనే కట్ చెయ్యడంతో ఆమె అభిమానులు హార్ట్ అయ్యారు.. అంటూ సోషల్ మీడియాలో రాతలు కనిపిస్తున్నాయి. మరి ట్రైలర్ కే ఫీలైపోతే ఎట్లా.. మొత్తం సినిమా చూసాక అప్పుడు మీనాక్షి కేరెక్టర్ విషయంలో డెసిషన్ తీసుకోవాలి కదా అంటున్నారు. లుక్స్ విషయంలో మీనాక్షి ని చక్కటి తెలుగమ్మాయిలా చూపించారు.

అసలు మహేష్ తో ఒక పాటైనా పెట్టారా? ఆమె నిడివి ఎంతుంది అనేది గుంటూరు కారం విడుదలయ్యాక మీనాక్షి చౌదరి కేరెక్టర్ పై అభిమానులు ఓ అంచనాకు వస్తే బావుంటుంది అనేది కొందరి అభిప్రాయం. 

What if it feels like that..:

Meenakshi Chaudhary fans disappointed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ