Advertisementt

RC16 లో అదే హైలెట్ అంట

Mon 08th Jan 2024 09:57 PM
rc16  RC16 లో అదే హైలెట్ అంట
Crazy news on RC16 RC16 లో అదే హైలెట్ అంట
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇంతలోపులో ఆయన తదుపరి చిత్రం RC16 ట్రెండ్ అవుతూ కనిపిస్తుంది. కారణం దర్శకుడు బుచ్చి బాబు రామ్ చరణ్ తో చేయబోతే RC16 విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేసుకుని సమయమొచ్చినప్పుడల్లా వాటిని రివీల్ చేస్తున్నారు. రీసెంట్ గా ఏ ఆర్ రెహ్మాన్ బర్త్ డే కి RC16 మ్యూజిక్ డైరెక్టర్ గా రెహ్మాన్ ని ఆహ్వానిస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు. 

ఇక ఈ చిత్రంలో చరణ్ తో తలపడబోయే విలన్ ఎంపిక దాదాపుగా పూర్తయ్యింది అని, అది కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ చరణ్ కి పవర్ ఫుల్ విలన్ గా రాబోతున్నారనే న్యూస్ వినిపించింది. ఇప్పుడు RC16 లో చరణ్ పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని, దీని కోసం రామ్ చరణ్ స్పెషల్ గా మేకోవర్ అవుతాడని, చరణ్ పై ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట, యాక్షన్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భారీ యాక్షన్ తో సాగుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కథలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలైట్ గా ఉంటుందట.

RC16 మొత్తం క్రీడా నేపథ్యంలో ఉండబోతుందట. రామ్ చరణ్ కి ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అంటున్నారు. బుచ్చిబాబు RC16 ని మార్చి నుంచి పట్టాలెక్కించే పనిలో ఉండడమేకాదు.. తన దగ్గర ఉన్న సమయాన్ని మొత్తం RC16 స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతూ దానిని పర్ఫెక్ట్ గా మలిచినట్లుగా తెలుస్తోంది.

Crazy news on RC16:

RC16 update 

Tags:   RC16
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ