ప్రభాస్ ప్రస్తుతం సలార్ సక్సెస్ ని సైలెంట్ గానే ఎంజాయ్ చేస్తున్నారు. సలార్ విజయం సాధించడంతో తన డార్లింగ్ ఫాన్స్ కి థాక్స్ చెప్పిన ప్రభాస్.. ఈరోజు సలార్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సందడి చేసారు. పృథ్వీ రాజ్, ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఇంకా నిర్మాతలు సలార్ సక్సెస్ ని కేక్ కట్ చేస్తూ ఎంజాయ్ చేసారు. అయితే సెలెబ్రేషన్స్ లో ప్రభాస్ కాస్త గెడ్డం అది పెంచి కొత్తగా కనిపించారు. ప్రభాస్ అలా న్యూ లుక్ లోకి మారడానికి కారణం ప్రాజెక్టు కే అంటే కల్కి అని తెలుస్తోంది.
ప్రభాస్ ఈ నెల 10 నుంచి కొద్దిరోజుల పాటు కల్కి షూటింగ్ లో జాయిన్ అవుతారు. కల్కి షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసి మారుతి తో చేస్తున్న షూటింగ్ సెట్స్ లోకి వెళతారని సమాచారం. కల్కి మే 9 న రిలీజ్ అంటూ వార్తలొస్తున్నాయి. ఈ విషయాని నాగ్ అశ్విన్ వాళ్ళు సంక్రాంతి సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ ప్రస్తుతం గెడం, మీసం, అలాగే ఈ కొత్త గెటప్ మొత్తం కల్కి కోసమేనట. మళ్ళీ మారుతి మూవీలోకి వెళ్ళేటప్పుడు క్లీన్ షేవ్ తో ఉంటారట ప్రభాస్.