రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతుంది.. వచ్చే నెల అంటే ఫిబ్రవరిలోనే ఆమె ఎంగేజ్మెంట్ చేసుకోబోతుంది.. అది కూడా ప్రేమించిన విజయ్ దేవరకొండ ని అంటూ కొన్ని వెబ్ సైట్స్ లో, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రముఖంగా హైలెట్ అయ్యింది. రష్మిక-విజయ్ దేవరకొండ ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు. డేటింగ్ లో ఉన్న వీరిరువురు ఫిబ్రవరిలో నిశ్చితార్ధం చేసుకుని పెళ్లితో ఒక్కటి కాబోతున్నారంటూ రాసుకోచ్చేసారు.. అది విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. ఎంతెలా అంటే.. చాలామంది నిజమే అనుకుంటున్నారు. రష్మిక-విజయ్ స్నేహితులు ఇప్పుడు జంటగా ఒక్కటికాబోతున్నారు అనుకున్నారు.
కానీ విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లిపై వస్తున్న వార్తలన్ని గాసిప్స్ మాత్రమే.. ఈ ఫేక్ న్యూస్ లు నమ్మొద్దు అంటూ రష్మిక, విజయ్ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. వీరిద్దరూ ఎవరి షూటింగ్స్ లో వాళ్ళు బిజీగా వున్నారు, వారు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే, వీరిద్దరూ ఎలాంటి నిశ్చితాతార్ధం కానీ, పెళ్లి కానీ చేసుకోబోవడం లేదు అని చెప్పడంతో.. రష్మిక పెళ్లి వార్తలకి చెక్ పడింది. ఇంతలోపులో రష్మిక యానిమల్ సక్సెస్ పార్టికి తానెలా వెళ్లిందో పిక్స్ షేర్ చేసింది.
బ్లాక్ డ్రెస్ లో మోడరన్ గా కనిపించిన రష్మిక మత్తెక్కించే చూపులతో యూత్ ని మెస్మరైజ్ చేసే లుక్ తో అదరగొట్టేసింది. లూజ్ హెయిర్ తో కళ్ళకి కాటుకతో రష్మిక టూ మోడరన్ గా దర్శనమిచ్చింది. ఆదివారం రాత్రి యానిమల్ సక్సెస్ పార్టీకి బాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరవగా.. అందులో యానిమల్ హీరోయిన్ రశ్మికనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినట్లుగా ఈ లుక్ చూస్తే తెలుస్తుంది.