Advertisementt

గాసిప్ వెబ్ సైట్స్ పై ఫైర్ అవుతున్న దిల్ రాజు

Mon 08th Jan 2024 06:33 PM
dil raju  గాసిప్ వెబ్ సైట్స్ పై ఫైర్ అవుతున్న దిల్ రాజు
Dil Raju Fires on Media and Social Media గాసిప్ వెబ్ సైట్స్ పై ఫైర్ అవుతున్న దిల్ రాజు
Advertisement
Ads by CJ

పండగ అందులోను సంక్రాంతి వచ్చింది అంటే.. పలు సినిమాలు బరిలోకి రావడము.. అందులో కొన్ని సినిమాలకి థియేటర్స్ సమస్య రావడము, నైజాం కి బడా డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు పై కొంతమంది హాట్ కామెంట్స్ చెయ్యడం తరచూ చూస్తున్నాము. ఇప్పుడు ఈ ఏడాది కూడా దిల్ రాజు గుంటురు కారాన్ని నైజాం లో విడుదల చేస్తున్నారు. అయితే చిన్న సినిమా హనుమాన్ విషయంలో దిల్  రాజు పై చేస్తున్న కామెంట్స్ కి దిల్ రాజు ఎమోషనల్ అయ్యారు. తాజాగా ప్రసాద్ లాబ్స్ లో ఓ ఈవెంట్ కి హాజరైన దిల్ రాజు తనపై తప్పడు రాతలు రాస్తున్న వెబ్ సైట్స్ పై ఫైర్ అయ్యారు.

ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు

ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి

ఏదో ఒక రకంగా నాపై ప్రతీ సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారు

చిరంజీవి నిన్న హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాపై మాట్లాడిన మాటలకు కొన్ని వెబ్ సైట్లు తప్పుగా వక్రీకరించాయి

నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తా.. 

వ్యాపార పరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు

ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు

తమిళ సినిమాను నేను పండగకు పోటీగా విడుదల చేస్తున్నా అని తప్పుగా రాసారు (సినీజోష్ కాదు) 

తమిళ సినిమాను నేనే వాయిదా వేయించాను

హను-మాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పాను

నైజాంలో హనుమాన్, గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి

నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు అనేది తప్పు

తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు

నేను ఎప్పుడు అందరికి అందుబాటులో ఉంటాను

మీ వైబ్ సైట్ల నన్ను వాడుకుంటే తాటతీస్తా.. అంటూ దిల్ రాజు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు.

Dil Raju Fires on Media and Social Media:

Dil Raju warns some gossip web sites

Tags:   DIL RAJU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ