Advertisementt

దేవర గ్లింప్స్: ఏరులై పారుతున్న రక్తం

Mon 08th Jan 2024 04:24 PM
devara  దేవర గ్లింప్స్: ఏరులై పారుతున్న రక్తం
Devara glimpse out దేవర గ్లింప్స్: ఏరులై పారుతున్న రక్తం
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 5 టార్గెట్ గా దేవర ప్యాన్ ఇండియా ఫిల్మ్ తో బరిలోకి దిగిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-దర్శకుడు కొరటాల శివ లు అందుకు అనుగుణంగా షూటింగ్ చేస్తూ అప్ డేట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఏ చిన్న విషయమైనా అభిమానులతో పంచుకుంటూ చక చకా షూటింగ్ ముగించేస్తున్నారు. ఏప్రిల్ 5 దేవర రిలీజ్ అన్నారు. సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఈలోపే దేవర గ్లింప్స్ ఇచ్చి ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేసేందుకు ముహూర్తం పెట్టి రోజురోజుకి గంటగంటకు అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. ఈరోజు జనవరి 8 సోమవారం సాయంత్రం 4.05 నిమిషాలకి దేవర గ్లింప్స్ వదిలారు మేకర్స్.

యాక్షన్ యాక్షన్ యాక్షన్.. దేవర గ్లిమ్ప్స్ మొత్తం యాక్షన్ తోనే నిండిపోయింది, లుంగీ కట్టి ఊరమాస్ అవతార్ లో ఊచకోత కోస్తూ కనిపించిన ఎన్టీఆర్ ని చూస్తే ఆయన ఫాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తుంటే.. గ్లింప్స్ చివరిలో ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ మరింత ఊపుని తీసుకొచ్చింది. ఈ సముద్రం చేపల్ని కంటే.. కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ చూసుండాది, అందుకే దీనిని ఎర్ర సముద్రం అంటారు.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అద్దిరిపోయింది.

ఎన్టీఆర్ లుక్స్, ఆ యాక్షన్ సీక్వెన్స్, సముద్రపు అలజడి, అందరిని ఏరిపారేసే క్రమంలో నీటిని ఎర్రగా రక్తంలా మార్చిన తీరు అన్నీ హైలెట్ అనేలా ఉన్నాయి. కొరటాల శివ మేకింగ్, అనిరుధ్ BGM బాగా ఎలివేట్ అయ్యాయి. మరి ఈ గ్లిమ్ప్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ సంక్రాంతి సెలెబ్రేషన్స్ మొదలు పెట్టేసారు. అయితే దేవర గ్లింప్స్ లో చిన్న సస్పెన్స్ క్రియేట్ చేసారు. ఏప్రిల్ 5 రిలీజ్ అని చెప్పకుండా దిస్ సమ్మర్ అంటూ చెప్పడం కాస్త గందరగోళంగా అనిపించింది.

Devara glimpse out:

Jr NTR Devara glimpse released 

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ