Advertisementt

కొత్త ఏడాది కొత్త కబురు కోసం వెయిటింగ్

Mon 08th Jan 2024 10:41 AM
akhil  కొత్త ఏడాది కొత్త కబురు కోసం వెయిటింగ్
Waiting for a new chat in the new year కొత్త ఏడాది కొత్త కబురు కోసం వెయిటింగ్
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలు ఫుల్ జోష్ లో షూటింగ్స్ చేసుకుంటున్నారు. తమ తమ సినిమాల సెట్స్ లో, సినిమా ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నారు. కానీ అక్కినేని అఖిల్ మాత్రం ఇంకా సైలెంట్ మోడ్ లోనే కనిపిస్తున్నాడు. గత ఏడాది అఖిల్ ఏజెంట్ మూవీతో కోలుకోలేని దెబ్బతిన్నాడు. ఆ మూవీ డిసాస్టర్ కావడంతో అఖిల్ తన తదుపరి మూవీ విషయంలో ఆలోచనలో పడిపోయాడు. గత ఏప్రిల్ నుంచి కామ్ గా కనబడుతున్న అఖిల్ కొత్త సినిమా కబురు కోసం అక్కినేని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.

అఖిల్ అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో ధీర అనే పవర్ ఫుల్ టైటిల్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడనే టాక్ నడిచినా అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు, ఆ విషయంపై ఎలాంటి అప్ డేట్ కూడా లేదు. దానితో అఖిల్ నెక్స్ట్ పై ఇంకా ఇంకా సస్పెన్స్ పెరిగిపోతుంది. నాగార్జున కూడా అఖిల్ కి సరైన హిట్ పడాలనే కసితో ఉన్నారు. అందుకు తగిన కథ కానీ, దర్శకుడు కానీ అఖిల్ కి దొరకడం లేదా.. అసలు ధీరని పట్టాలెక్కిస్తారా.. లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

కొత్త ఏడాది మొదలైపోయింది. అప్పుడే వారం గడిచిపోయింది. మరి ఇప్పటికైనా అఖిల్ ఓ నిర్ణయానికి వచ్చి తన నెక్స్ట్ మూవీ పై అభిమానులకి శుభవార్త వినిపిస్తాడా.. అనేది ప్రస్తుతం ఎదురు చూడక తప్పేలా లేదు. 

Waiting for a new chat in the new year:

Still suspense on Akhil next

Tags:   AKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ