అభిమానుల ఎదురు చూపులకి అడ్డుకట్ట వేస్తూ గుంటూరు కారం ట్రైలర్ ని మేకర్స్ ఇక ఆలస్యం చెయ్యకుండా ఆస్వాదించమంటూ కొద్దిక్షణాల క్రితమే రివీల్ చేసారు. హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ లో గుంటూరు కారం ట్రైలర్ ని అభిమానుల ఆనందోత్సాహాల మధ్యన విడుదల చేసారు. త్రివిక్రముడు మహేష్ ని అతడులో కామ్ గా, ఖలేజాలో కామెడీగా చూపించారు, ఇప్పుడు గుంటూరు కారంలో మాస్ గా ప్రెజెంట్ చేస్తున్నారు.. ఆయనతో ఎలాంటి డైలాగ్స్ చెప్పించారో అనే ఆత్రంలో అభిమానులు ఉన్నారు.
మీరు మీ పెద్దబ్బాయిని.. అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు అని రమ్యకృష్ణను ఓ రిపోర్టర్ అడగడంతో గుంటూరు కారం ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత మహేష్ మిర్చి యార్డ్ లో రెడ్ కలర్ జీప్ నుంచి దిగే షాట్ కి మహేష్ ఫాన్స్ విజిల్స్ వెయ్యాల్సిందే. చూడంగానే మజా వచ్చిందా.. హార్ట్ బీట్ పెరిగిందా.. ఈల వేయాలనిపించిందా అంటూ ప్రతి సీన్ కి ప్రతి డైలాగ్ కి మహేష్ లో ఫుల్ ఎనర్జీ కనిపించింది. బ్బా.. బ్బా.. బ్బా అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్, మ్యానిరిజం, గుంటూరు యాస అన్ని సెట్టయ్యాయి. ప్రకాష్ రాజ్ ఆడు బ్రేకుల్లేని లారీ అంటూ మహేష్ ని ఉద్దేశించి చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. శ్రీలీల కూడా ఎనర్జీగా, అందంగా కనిపించింది. మీనాక్షి చౌదరికి ట్రైలర్ లో కాస్త చోటిచ్చారు గురూజీ.. రమ్యకృష్ణ కి ట్రైలర్ లో డైలాగ్స్ లేకపోయినా ఈ చిత్రానికి సెంటరాఫ్ పాయింట్‌లా అనిపిస్తోంది. జగపతి బాబు స్పెషల్ మేకోవర్, ఈశ్వరీ రావు, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్ ఇలా అన్నీ పాత్రలకు ప్రాధాన్యత ఉందని ట్రైలర్ ద్వారా చెప్పేసారు.
గుంటూరు రాజకీయం చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మాస్ యాక్షన్ సీన్లతో ట్రైలర్ అదిరిపోయింది. 2 నిమిషాల 47 సెకన్ల పాటు ఉన్న ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. థమన్ BGM కి మహేష్ డైలాగ్స్ కూడా అర్ధం కాకుండా పోయాయి. త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ పంచ్ డైలాగ్స్ అంతగా కనిపించకపోయినా.. ట్రైలర్ మాత్రం ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా కనిపిస్తోంది. జనవరి 12న రాబోతోన్న గుంటూరు కారం మీద ఈ ట్రైలర్ అంచనాలను బాగానే పెంచేసింది.