విగ్నేష్ శివన్ అనే పేరు ఇప్పుడు ఎక్కువగా నయనతార భర్త అనే ట్యాగ్ తోనే వినిపిస్తోంది, నేను రౌడీనే తర్వాత విగ్నేష్ శివన్ నుంచి వచ్చిన ఏ ఒక్క సినిమా హిట్ కాలేదు. టాప్ హీరోయిన్ నయన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాక విగ్నేష్ పేరు నయనతార పక్కన మార్మోగిపోతోంది. అయితే నయనతార తో పెళ్లి కాక ముందే అజిత్ తో సినిమా ఓకె చేసుకున్న విగ్నేష్, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి అజిత్ తప్పుకోవడం, నిర్మాతలు వేరే డైరెక్టర్ ని పెట్టుకోవడంతో విగ్నేష్ బాగా బ్రేక్ తీసుకుని లవ్ టుడే హీరో ప్రశాంత్ రంగనాథన్ తో మూవీని ప్రకటించారు. ఆచిత్రాన్ని రీసెంట్ గానే పూజ కార్యక్రమాలతో మొదలు కూడా పెట్టారు.
ఇంతలోనే ఆ చిత్రంపై కాంట్రవర్సీలు మొదలైపోయాయి. LIC ని ప్రకటించగానే కోలీవుడ్ డైరెక్టర్ కుమారన్ ఇది తన టైటిల్ అని, తాను ఎనిమిదేళ్ల క్రితమే రిజిస్టర్ చేయించుకున్నాను, ఈ టైటిల్ పై సర్వ హక్కులు తనకే ఉన్నాయంటూ, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించాడు. ఆ గొడవ అలా కొనసాగుతుండగానే.. ఇప్పుడు విగ్నేష్ ని మరో సమస్య చుట్టుముట్టింది.
ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ ఐసి వారు ఈ టైటిల్ మా సంస్థ పేరుని చెడగట్టేదిలా ఉంది అంటూ విగ్నేష్ శివన్ కి నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. తమ సంస్థకి ప్రజల్లో మంచి పేరుంది. సినిమా కోసం తమ సంస్థ పేరుని ఉపయోగిస్తే ప్రజల్లో తమ ప్రతిష్ట దెబ్బతింటుంది అని, వారం రోజుల గడువులో టైటిల్ మార్పు చేయకపోతే లీగల్ గా క్రిమినల్ గా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఎల్ ఐసి సంస్థ నోటీసులు జారీ చెయ్యడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై విగ్నేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.