Advertisementt

గుంటూరు కి షిఫ్ట్ అవుతున్న గుంటూరు కారం

Sun 07th Jan 2024 01:31 PM
guntur kaaram  గుంటూరు కి షిఫ్ట్ అవుతున్న గుంటూరు కారం
Guntur Kaaram pre release event in Guntur? గుంటూరు కి షిఫ్ట్ అవుతున్న గుంటూరు కారం
Advertisement
Ads by CJ

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిన్న శనివారం జరగాల్సి ఉండగా.. పోలీస్ పర్మిషన్స్ దొరకని కారణంగా చివరి నిమిషంలో ట్విస్ట్ ఇస్తూ మేకర్స్ ఈవెంట్ ని పోస్ట్ పోన్ చెయ్యడంతో మహేష్ అభిమానులు చాలా అంటే చాలా డిస్పాయింట్ అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటుగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కూడా పోస్ట్ పోన్ చెయ్యడము.. గుంటూరు కారం ట్రైలర్ ఈరోజు ఆదివారం రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ చెప్పడము జరిగింది.

అయితే జనవరి 12 న విడుదల కాబోతున్న గుంటురు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇంకా సస్పెన్స్ నడుస్తూనే ఉంది. అసలు ఉంటుందా.. ఉండదా అనే అనుమానంలో అభిమానులు ఉన్నారు. అయితే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖచ్చితంగా ఉంటుంది, అది జనవరి 9 అంటే మంగళవారం ఉండొచ్చనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా హైదరాబాద్ లో యూసఫ్ గూడలో క్యాన్సిల్ అయిన ఈవెంట్ కోసం కూకట్ పల్లి గ్రౌండ్స్ కూడా పరిశీలించారు. అక్కడ కూడా సెక్యూరిటీ రీజన్స్ అంటూ పర్మిషన్ ఇవ్వలేదు.

అందుకే గుంటురు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ నుంచి గుంటూరు కి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని.. అక్కడ ఈవెంట్ కి కావల్సిన పర్మిషన్స్, మిగతా వ్యవహారాలపై మేకర్స్ తలమునకలై ఉన్నారని.. ఏ క్షణాన అయినా.. గుంటూరు కారం ఈవెంట్ పై నిర్మాతలు ఓ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.

Guntur Kaaram pre release event in Guntur?:

Guntur Kaaram Pre-Release Event Update

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ