Advertisementt

ఇంట్రెస్టింగ్: అక్కడ వెంకీ, ఇక్కడ నాగ్

Sun 07th Jan 2024 12:35 PM
venkatesh,nagarjuna  ఇంట్రెస్టింగ్: అక్కడ వెంకీ, ఇక్కడ నాగ్
Interesting: Venky there, Nag here ఇంట్రెస్టింగ్: అక్కడ వెంకీ, ఇక్కడ నాగ్
Advertisement
Ads by CJ

సీనియర్ హీరోలైన వెంకటేష్-నాగార్జున ఇద్దరూ ఈ సంక్రాంతి పండగకి పోటీ పడుతున్నారు. వెంకటేష్ సస్పెన్స్ థ్రిల్లర్ సైంధవ్‌ తో, నాగార్జున ఫ్యామిలీ ఎంటర్టైనర్ నా సామిరంగా తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. సైంధవ్‌ జనవరి 13 న విడుదలవుతుంటే.. నా సామిరంగా జనవరి 14 భోగి రోజున విడుదల కాబోతుంది. సైంధవ్‌ ప్రమోషన్స్ పరంగా చాలా ఫాస్ట్ గా ఉంటే.. నాగార్జున హడావిడిగా నిన్న శనివారమే నా సామిరంగా షూటింగ్ కంప్లీట్ చేసారు. అయినా ప్రమోషన్స్ పరంగా తగ్గడం లేదు.

అయితే ఇప్పుడు వెంకీ, నాగ్ లు ప్రమోషన్స్ విషయంగా బుల్లితెర మీద చెరో ఛానల్ లో ఈ సంక్రాంతి రోజున పోటీకి సై అంటున్నారు. వెంకటేష్ ఈటిలో ప్రసారమయ్యే సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రాం.. అల్లుడా మజాకా లో స్పెషల్ గెస్ట్ గా రావడమే కాదు.. హీరోయిన్స్ ఖుష్బూ, మీనాలతో కలిసి స్టెప్పులేస్తూ హంగామా చేసారు. సరదా సరదాగా కామెడీ చేస్తూ కవ్వించారు. ఇక మన్మధుడు నాగార్జునకి బుల్లితెర అడ్డా స్టార్ మా అని తెలిసిందే. స్టార్ మాలో సంక్రాంతికి రాబోయే స్పెషల్ ప్రోగ్రాం సంక్రాంతి దద్దరిల్లగా లో తన హీరోయిన్ ఆషిక రంగనాధన్ తో కలిసి వచ్చారు.

అంతేకాదు స్టార్ మా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో సందడి చేస్తూ డాన్స్ లు వేస్తూ నాగార్జున నా సామిరంగాని స్పెషల్ గా ప్రమోట్ చేసుకున్నారు. మరి ఇద్దరు సీనియర్ హీరోలు ఇలా తమ సినిమాలకోసం రెండు ఛానల్స్ లో చేసిన సంక్రాంతి సందడి ఇంట్రెస్టింగ్ గా కనిపించడమే కాదు.. తమ సినిమాల కోసమే కాదు.. ఆ ప్రోగ్రామ్స్ కోసం కూడా ప్రేక్షకులని వెయిట్ చేసేలా చేస్తున్నారడంలో సందేహమే లేదు. 

Interesting: Venky there, Nag here:

Venkatesh in ETV Sankranthi programme, Nagarjuna in Star Maa Sankranthi programme

Tags:   VENKATESH, NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ