ఇప్పుడు ఈటీవి నుంచి పూర్తిగా దూరమై స్టార్ మాకి కేరాఫ్ గా మారిన ముక్కు అవినాష్ రెండేళ్ల క్రితమే అనూజని వివాహం చేసుకున్నాడు. భార్య తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తాము చేసే ప్రతి పనిని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఒకప్పుడు జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా కొనసాగిన ముక్కు అవినాష్ ఆ తర్వాత స్టార్ మా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తన టాలెంట్ చూపించాడు. ఆ తర్వాత ఏడాది గడిచినా అవినాష్ మళ్ళీ జబర్దస్త్ కి పోలేదు, స్టార్ మా లోనే తన పెరఫార్మెన్స్ చూపిస్తున్నాడు. స్టార్ మాలోనే తన భార్యతో కలిసి సందడి చేసాడు.
ఇక గత ఏడాది ఏప్రిల్ లో అవినాష్ తాను తండి కాబోతున్న విషయాన్ని తెలియజేసాడు. తన భార్య ప్రెగ్నెంట్ అని తమకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా ఎదురు చూస్తున్నట్టుగా వీడియోస్ చేసాడు. స్నేహితులు, చుట్టాలు, సన్నిహితుల మధ్యన అనూజ శ్రీమంతం వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించాడు. హాస్పిటల్ కి వెళ్లినా, మారేదన్నా అయినా వీడియోస్ చేసి చూపించిన అవినాష్ ఇప్పుడు తన ఇంట్లో జరిగిన విషాదాన్ని కూడా అందరితో పంచుకున్నాడు. అది తనకి పుట్టబోయే బిడ్డని కోల్పోయినట్టుగా చెప్పాడు. తల్లితండ్రులం కావాలనే కోరికతో ఉన్న మాకు మా బిడ్డ దక్కలేదు, ప్రతి సంతోషాన్ని, బాధని మీతో పంచుకునే నేను నా విషాదాన్ని మీతో పంచుకోవాలని ఈ విషయం చెప్పాను.
ఇది అంత త్వరగా మర్చిపోలేనిది, కానీ ఈ విషయాన్ని ఎప్పటికైనా మీతో చెప్పాలనే బాధ్యతతో ఇది చెబుతున్నాను, దయ చేసి ఈ విషయమై ఎలాంటి కామెంట్స్ కానీ, ప్రశ్నలు కానీ అడగొద్దు, మీరు ఇప్పటివరకు నన్ను నా భార్యని ఆదరించారు, ఇకపై కూడా ఇలానే ఆదరిస్తారని అనుకుంటున్నాను అంటూ అవినాష్ తన లైఫ్ లో జరిగిన విషాదర సంఘటనని పోస్ట్ చేసాడు.