ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే.. సంక్రాంతికి విడుదల కాబోతున్న గుంటూరు కారం అప్ డేట్, మహేష్ బాబు స్టిల్స్, మహేష్ తో శ్రీలీల, మీనాక్షి చౌదరి పోస్టర్, అలాగే మరో చిత్రం తేజ సజ్జ హనుమాన్ హడవిడి, ఇంకా వెంకటేష్ సైంధవ్ ప్రమోషన్స్, ఇక నా సామిరంగా అంటూ నాగార్జున హంగామా ఇలా సోషల్ మీడియా మొత్తం పండగ సినిమాలు హడావిడి, అభిమానుల రచ్చ, ఆత్రుత ఇవే కనిపిస్తున్నాయి. గుంటురు కారం ట్రైలర్ కోసం మహేష్ అభిమానుల యుద్ధమూ కనిపిస్తుంది.
మరి పండగ సినిమాలే కాదు.. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల హడావిడి మరో ఎత్తు, పండగ సినిమాలన్నీ ఒక క్రేజీ అయితే దేవర గ్లిమ్ప్స్ మరో క్రేజీ అన్నట్టుగా ఎన్టీఆర్ ఫాన్స్ దేవర గ్లిమ్ప్స్ పై చూపిస్తున్న ఆత్రుత, ఆరాటం అంతా ఇంతా కాదు.. ప్యాన్ ఇండియా ఫిలిం దేవర గ్లిమ్ప్స్ ఈ నెల 8 అంటే సోమవారం విడుదల కాబోతున్నాయి. దేవర గ్లిమ్ప్స్ సోమవారం సాయంత్రం 4.05 నిమిషాలకి విడుదల చేస్తున్నామని చెప్పగానే ఎన్టీఆర్ ఫాన్స్ దేవర హ్యాష్ టాగ్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.
#KoratalaShiva, #DevaraPart1, #Devara, #JrNTR, #JanhviKapoor ఇవే హ్యాష్ టాగ్స్ పండగ సినిమాలతో పాటుగా దర్శనమిస్తున్నాయి. ట్విట్టర్ X లో #MaheshBabu, #GunturKaaram, #Hanuman, #Saindhav, #NaaSaamiRanga ఇవే కనబడుతున్నాయి. అవి చూసిన నెటిజెన్స్ పండగ సినిమాలు vs దేవర గ్లిమ్ప్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.